‘ఓటుకు కోట్లు’ విచారణ జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం | Supreme Court Postpones Cash for Vote Case Hearing | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’ విచారణ జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం

Oct 28 2026 4:09 AM | Updated on Oct 28 2026 4:09 AM

Supreme Court Postpones Cash for Vote Case Hearing

ఏళ్ల తరబడి ఇంటర్వెన్షన్లు రావడంపై ధర్మాసనం అసంతృప్తి

జోక్యానికి అనుమతిస్తే.. కౌంటర్లు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్న 

ఇలాంటి చర్యలతోనే న్యాయ ప్రక్రియ ఆలస్యమవుతోందని వ్యాఖ్య 

సెక్షన్‌ 12 చట్టపరమైన అంశాలపైనే విచారణ జరుపుతామని స్పష్టీకరణ 

తదుపరి వాదనలు కోర్టు సెలవుల తర్వాతే..  

సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్ద కాలం క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసులో ఏళ్ల తరబడి ఇంటర్వెన్షన్‌ పిటిషన్లు దాఖలు కావడం, వా­టి వల్ల విచారణలో జాప్యం జరుగుతుండటం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీర­య్య తది­తరులు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ (క్రిమిన­ల్‌) పిటిషన్లపై మంగళవారం భారత ప్రధాన న్యా­యమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జో­య్‌­మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మా­సనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇంటర్వెన్షన్‌ పేరుతో కేసు విచారణను పొడిగించే ప్రయ­త్నాలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 

కౌంటర్లు ఎలా వేస్తారు?  
విచారణ సందర్భంగా ఇంటర్వెన్షన్‌ పిటిషన్ల వ్యవహారంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇంటరీ్వనర్లకు కేవలం జోక్యానికి మా­త్రమే అనుమతి ఇచ్చామని, అలాంటప్పుడు వా­రు కౌంటర్‌ డాక్యుమెంట్లు ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. చాలాకాలం తర్వాత అకస్మాత్తుగా ఇంటర్వెన్షన్లు తెరపైకి వస్తుండటం వల్ల అసలు కేసు విచారణకు ఆటంకం కలుగుతోందని, ఇలాంటి చర్యలు విచారణను తీవ్రంగా జాప్యం చేస్తున్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. 

సెక్షన్‌ 12 పైనే విచారణ..  
ఈ కేసులో అనవసర వాదనలకు తావు లేకుండా, కేవలం చట్టపరమైన అంశాలపైనే దృష్టి సారిస్తా­మని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేసు విచారణను అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 12 వర్తింపు, దాని పరిధికి సంబంధించిన స్పష్టమైన చట్టపరమైన అంశం (క్లీన్‌ లీగల్‌ పాయింట్‌) పైనే కొనసాగిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇరువర్గాల న్యాయవాదుల అంగీకారంతో తదుపరి విచారణను కోర్టు దీపావళి సెలవుల తర్వాత చేపట్టనున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement