ట్యూబెక్టమీ తరువాత ప్రెగ్నెన్సీ : రూ. 72,500 గెల్చుకుంది | Jharkhand woman gets pregnant after tubectomy wins Rs 72500 payout | Sakshi
Sakshi News home page

ట్యూబెక్టమీ తరువాత ప్రెగ్నెన్సీ : రూ. 72,500 గెల్చుకుంది

Oct 27 2026 6:58 PM | Updated on Oct 27 2026 7:08 PM

Jharkhand woman gets pregnant after tubectomy wins Rs 72500 payout

జార్ఖండ్‌లోని గిరిడిహ్‌లో చోటు చేసుకున్న పరిణామం ఆసక్తికరంగా మారింది ట్యూబెక్టమీ ప్రక్రియ చేయించుకున్నప్పటికీ గర్భవతి అయిన మహిళకు పరిహారం దక్కింది.  రూ. 72,500 చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్  ఆమెకు ఆపరేషన్‌ చేసిన వైద్యుడిని ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే..

అప్పటికే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్న ఆ దంపతులు  ఇక బిడ్డలు చాలు అనుకున్నారు. ఈ నేపథ్యంలో వారు కుటుంబ నియంత్రణ చేసుకోవాలని భావించారు.  భర్త కుటుంబ నియంత్రణ చేయించుకోవాలని  సదరు వైద్యుడిని సంప్రదించగా, ట్యూబెక్టమీ చేయించుకోమని ఆమె సలహా ఇచ్చాడు.దీంతో 2022 డిసెంబర్ 14న రూ. 15,000 ఫీజు చెల్లించి క్లినిక్‌లో ట్యూబెక్టమీ (Tubectomy) ఆపరేషన్ చేయించుకున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్  విఫలం  కావడంతో ఆగస్టు 26, 2023న మహిళ మళ్లీ గర్భవతి అని తేలడంతో దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై డాక్టర్ సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.

ఆపరేషన్ విఫలమై మహిళ గర్భవతి కావడంపై విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్, వైద్య నిర్లక్ష్యం (Medical Negligence) , సేవా లోపంపై  సదరు వైద్యుడి నిర్లక్ష్యాన్ని నిరూపిస్తూ బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

(దీపావళి ధమాకా : ఆ ఉద్యోగులకు సరికొత్త కియా కార్లు)

డాక్టర్ వాదన: ఆపరేషన్ సమర్థవంతంగానే చేశానని, ట్యూబెక్టమీ ఫలితం 100% నమ్మకం కాదని, ఇందులో 0.4% నుండి 2% వరకు విఫలమయ్యే అవకాశం ఉందని ముందుగానే దంపతులకు వివరించి సమ్మతి (Consent) తీసుకున్నట్లు డాక్టర్ వాదించారు. ఆ తర్వాత గర్భం వద్దనుకుంటే అబార్షన్ చేయించుకునే అవకాశం కూడా ఉందన్నారు. 

ఇదీ చదవండి: కర్ణాటకలో ఎస్‌ఐఆర్‌ కలకలం : సుమారు కోటి మందికి భారీ షాక్‌!

కమిషన్ తీర్పు: ఆపరేషన్ సరిగ్గా, నిర్లక్ష్యం లేకుండా చేశారని నిరూపించడానికి డాక్టర్ ఎలాంటి ఆధారాలు లేదా పత్రాలు సమర్పించలేకపోయారని కమిషన్ గుర్తించింది. బాధితురాలు తగిన ఆధారాలతో వైద్య నిర్లక్ష్యాన్ని,సేవా లోపాన్ని నిరూపించగలిగారని కమిషన్ స్పష్టం చేసింది. ఇందుకుగాను ఆపరేషన్ కోసం తీసుకున్న  రూ. 15,000 ఫీజును తిరిగి రీఫండ్ చేయాలని చెప్పింది. అలాగే ఆమెను శారీరక, మానసిక వేదనకు గురిచేసినందుకు  రూ. 50,000 పరిహారంతోపాటు, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 7,500  చెల్లించాలని  డాక్టర్‌ను ఆదేశించింది.

ఇదీ చదవండి: 15 ఏళ్లలో 38 మందిని చంపి తిన్న సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement