కోల్‌కతాలోఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంజయ్ కపూర్ అనే ఎక్స్ (X) వినియోగదారుడు ఈ ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నిందితుడి పేరు ప్రకాష్ బచావత్ అని, బాధితురాలు దీపికా జైన్ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. దీని ప్రకారం ఒక అపార్ట్‌మెంట్ లాబీలో ఒక వ్యక్తి మహిళపై దాడి చేశాడు. బాధితురాలు లేచి అక్కడి నుంచి వెళ్లి పోవడానికి ప్రయత్నించగా, ఆమెను చెంపదెబ్బ కొట్టి మరీ జుట్టు పట్టుకుని లాబీ బయటకు ఈడ్చుకెళ్లాడు. కింద పడేసి దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు చూస్తూ ఉండిపోయాడు.ఈ ఘటన అక్టోబర్ 10న జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. కోల్‌కతా పోలీసులు దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
Horrific CCTV footage is circulating from Kolkata. The heartless and ruthless perpetrator reportedly is apparently some Prakash Bachawat and the victim is some Dipika Jain, or names to that effect. @KolkataPolice, please verify the footage, investigate this alleged criminal behaviour, and take strict action in accordance with the law. @SuvenduWB @BJP4Bengal @KPDetectiveDept
— Sanjay Kapur (@sanjay1193) October 26, 2026
ఇదీ చదవండి: 15 ఏళ్లలో 38 మందిని చంపి తిన్న సీరియల్ కిల్లర్ అరెస్ట్
ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంజయ్ కపూర్ కోల్‌కతా పోలీస్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ విభాగం ,అదనపు పోలీస్ కమిషనర్ల అధికారిక ఖాతాలను ట్యాగ్ చేశారు.
ఇదీ చదవండి: కర్ణాటకలో ఎస్‌ఐఆర్ కలకలం : సుమారు కోటి మందికి భారీ షాక్!
అయితే ఈ ఘటనపై కోల్‌కతా పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. వీడియోలో ఉన్నది ఎవరు?, ఈ దాడికి గల కారణాలు ఏంటి అనేదానిపై అధికారిక నిర్ధారణ ఏదీ ఇంకా వెలువడ లేదు.


