తెలుగులో మాట్లాడుకున్న తిలక్, నితీశ్‌రెడ్డి
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ (26 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్), నితీశ్‌కుమార్ రెడ్డి (13 బంతుల్లో 26 నాటౌట్) ఆఖరిదాకా నిలిచి జట్టును గెలిపించారు. ఈ నేపథ్యంలో ఈ జోడీ ఏడో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించడం విశేషం.
అయితే వీరిద్దరు కలిసి బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో పరస్పరం తెలుగులో మాట్లాడుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు తెలుగువాళ్లే కావడంతో స్థానిక భాష మాట్లాడడం పెద్దగా ఆశ్చర్యపరచనప్పటికీ, ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో.. అందునా విదేశీ గడ్డపై నితీశ్ రెడ్డి, తిలక్ వర్మ తెలంగాణ యాసలో మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. స్ట్రైక్‌లో ఉన్న తిలక్ వర్మ మాట్లాడుతూ..‘‘నువ్వు కాల్ ఇవ్వలేదు..’’ అనగానే, నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న నితీశ్ రెడ్డి వెంటనే.. ‘‘నువ్వు వచ్చేసేయ్.. నేను వచ్చేస్తా ఆరాంసే’’ అని తెలిపాడు. దీనికి తిలక్.. ‘‘రేయ్ రెండు అని చెప్పురా పోనీ.. నేను ముందొచ్చి వెయిట్ చేస్తున్నా నీకోసం’’ అని గట్టిగా అరుస్తూ చెప్పడం కనిపించింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ మైక్ స్టంప్‌లో రికార్డరవ్వడంతో మాటలు వెలుగులోకి వచ్చాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. టాపార్డర్‌లో ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (7), ఫిన్ అలెన్ (16)... డారిల్ మిచెల్ (6) విఫలమైనా.. గ్లెన్ ఫిలిప్స్, బేవాన్ జేకబ్స్ అర్ధ శతకాలతో అదరగొట్టారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు కూల్చగా.. భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, నితీశ్ రెడ్డి తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు సంజూ శాంసన్ (17 బంతుల్లో 14), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 27) నిరాశపరిచారు. ఈ తరుణంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు తోడైన ఆల్‌రౌండర్ నమన్ ధీర్ మెరుపు ఇన్నింగ్స్ (17 బంతుల్లో 31) ఆడాడు. తిలక్ వర్మ 25 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. నితీశ్ రెడ్డి 13 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నాలుగు వికెట్లు తీశాడు.
Andhra vs Telangana ❌ Seeing our Telugu boys Nitish Kumar Reddy and Tilak Varma stand up for India at the international level and Speaking in Native Language♥️♥️💪 https://t.co/OM5LkwVCzc
— పోరా కుయ్యా (@karthik14321) October 24, 2026
తిలక్ - నువ్వు కాల్ ఇవ్వలేదు నితీష్ - నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే తిలక్ - రేయ్ రెండు అని చెప్పురా పోనీ ఎంత బాగుందో ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తెలుగులో మాట్లాడుకుంటుంటే 😍 https://t.co/pkhzaiWJXZ
— పల్నాడు పెద్దిరెడ్డి (@MrHyperReddy) October 24, 2026
THE BOYS FROM HYDERABAD - Tilak & Nitish 🥹❤️ https://t.co/kDqJwfFmjV
— Johns. (@CricCrazyJohns) October 24, 2026
Stood out when it mattered the most 🇮🇳 Stay tuned for a special chat coming soon on https://t.co/DTi7UzPc4R ⏳ #TeamIndia | #INDvNZ | @TilakV9 | @NKReddy07 https://t.co/6maSFMr34h
— BCCI (@BCCI) October 24, 2026
ఇదీ చదవండి:


