జోరు సాగనీ... | Second ODI between India and Zimbabwe womens teams today | Sakshi
Sakshi News home page

జోరు సాగనీ...

Oct 25 2026 3:35 AM | Updated on Oct 25 2026 3:35 AM

Second ODI between India and Zimbabwe womens teams today

నేడు భారత్, జింబాబ్వే మహిళల జట్ల మధ్య రెండో వన్డే 

మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం

వడోదర: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు... మరో సిరీస్‌ విజయంపై కన్నేసింది. జింబాబ్వేపై టి20 సిరీస్‌ చేజిక్కించుకున్న స్మృతి మంధాన సారథ్యంలోని టీమిండియా... ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించిన టీమిండియా... అదే జోరు కొనసాగించాలని చూస్తోంది.

బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టుకు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. ఫీల్డింగ్‌ను మరింత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. గత మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన ప్రతీక రావల్‌పై భారీ అంచనాలు ఉండగా... స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా షఫాలీ... ప్రత్యర్థి బౌలర్ల అనుభవరాహిత్యాన్ని వినియోగించుకుంటూ భారీ షాట్‌లతో విరుచుకుపుడుతోంది. 

మిడిలార్డర్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మ కీలకం కానున్నారు. గత మ్యాచ్‌ ద్వారా కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్న ఆంధ్ర స్పిన్నర్‌ శ్రీచరణిని ఎదుర్కోవడం జింబాబ్వే బ్యాటర్లకు శక్తికి మించిన భారంగా మారింది. ఆమెతో పాటు దీప్తి, క్రాంతి గౌడ్‌ను జింబాబ్వే బ్యాటర్‌లు ఎలా ఎందుర్కొంటారనేదానిపైనే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement