మరిది ప్రైవేట్ పార్ట్‌ను కొరికిన వదిన.. 55 కుట్లు | Woman bit Brother in law Private Part | Sakshi
Sakshi News home page

మరిది ప్రైవేట్ పార్ట్‌ను కొరికిన వదిన.. 55 కుట్లు

Oct 25 2026 12:56 PM | Updated on Oct 25 2026 1:01 PM

Woman bit Brother in law Private Part

కాన్పూర్: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా  పురావూపూర్ గ్రామంలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఇంట్లో పిల్లల మధ్య జరిగిన సాధారణ గొడవ పెద్దల వరకు చేరడంతో, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ వివాదంలో వదిన తన మరిదితో గొడవపడి, ఆగ్రహంతో అతని ప్రైవేట్ పార్ట్‌ను గట్టిగా కొరికింది.

దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని కుటుంబ సభ్యులు మొదట ఘటంపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కాన్పూర్‌లోని హేలట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి తక్షణం చికిత్స అందించారు. గాయాల తీవ్రత కారణంగా అతనికి 55 కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement