డీఏ, డీఆర్ పెంపు.. కేంద్ర క‍్యాబినెట్ కీలక నిర్ణయాలు | Modi Cabinet Big Announcement, 3% DA Hike For Central Employees And Pensioners, Check Out Latest Details Inside | Sakshi
Sakshi News home page

DA Hike News: డీఏ, డీఆర్ పెంపు.. కేంద్ర క‍్యాబినెట్ కీలక నిర్ణయాలు

Oct 28 2026 3:40 PM | Updated on Oct 28 2026 3:54 PM

Cabinet approves 3 per cent DA DR hike

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర క‍్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3% డీఏ, డీఆర్ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1.16 కోట్ల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు 2026 జులై 1 నుంచి ఈ పెంపు వర్తించనుంది.

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

  • కంటైనర్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ప్రత్యేక పథకం.

  • క్రీడా వస్తువుల తయారీ రంగ అభివృద్ధికి ‘ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్’కు రూ.1,856 కోట్లు కేటాయింపు.

  • డీఏ (కరవు భత్యం), డీఆర్ (కరవు సహాయ భత్యం) కోసం రూ.10,016 కోట్ల కేటాయింపు.

  • కేంద్ర కేబినెట్ ప్రకటించిన నాలుగు నిర్ణయాలకు కలిపి మొత్తం రూ.29,267 కోట్ల కేటాయింపు.

  • ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజనకు రూ.7,395 కోట్ల కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement