జైపూర్‌లో ఒక వ్యాపారికి ఊహించని విధంగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. సాయంత్రం పూట ఆకలిగా ఉందని కచోరి తినడానికి వెళ్లి, భారీగా నగదు ఉన్న బ్యాగును కోల్పోయిన వైనం అతని నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శంగా నిలిచింది. సోమవారం సాయంత్రం నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అసలు ఏమైంది అంటే...
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో, చంపాలాల్ అనే వ్యాపారి కచోరీ తినడానికి తన స్కూటర్‌ను ఆపాడు. కనీస ముందు చూపు లేకుండా నగదు బ్యాగును స్కూటర్ ముందు భాగంలో ఉంచారు. స్కూటర్‌పై కూర్చుని హాయిగా కచోరీ తింటున్నారు. ఇదే అదనుగా భావించి, స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు అక్కడ పెట్టిన 20 లక్షల రూపాయల నగదున్న బ్యాగును ఎత్తుకెళ్లారు. అంతే నిమిషాల్లో అంత డబ్బు మాయమైపోయింది.
ఇదీ చదవండి: ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్ స్పెషాల్టీ ఇదే!
₹20 Kachori Costs Trader ₹20 Lakh: Businessman's Cash-Filled Bag Stolen in Seconds in Jaipur's Nahargarh, Shocking Theft Captured on CCTV. In a stunning daylight heist in Jaipur's Nahargarh police station limits, businessman Champalal suffered a catastrophic loss of ₹20 lakh while stopping to buy a ₹20 kachori. The victim had placed a bag stuffed with ₹20 lakh in cash on the footboard of his scooter before stepping aside to grab a quick snack. Within moments, an opportunist thief snatched the unattended cash bag and vanished into the crowded street. The entire theft was captured on nearby CCTV surveillance cameras. Following an immediate distress call, Jaipur Police enforced widespread city barricading and launched a targeted manhunt based on the footage to nab the accused and recover the looted cash. @jaipur_police
— GarudEyeIntel | OSINT 🇮🇳 (@GarudEyeIntel) October 27, 2026
వెంటనే అప్రమత్తమైన , తన చేతిలో ఉన్న కచోరీని అలాగే పట్టుకుని చంపాలాల్ వారిని వెంబడించారు. స్థానికులు కూడా ఆయనకు తోడయ్యారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే వారిద్దరు తప్పించుకొని ఉడాయించారు. దీనివల్ల ఆ వ్యాపారికి తాను తిన్న కచోరీ ధర కంటే దాదాపు వెయ్యి రెట్లు ఎక్కువ నష్టం వాటిల్లింది. చంపాలాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హెల్మెట్లు ధరించి ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: జిమ్ ట్రైనర్‌తో లవ్.. భర్తపై హత్యాయత్నం : కట్ చేస్తే..!


