సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలోని బవానా పీఎస్ పరిధిలో కాల్పుల కలకలం రేగింది. ఓ వ్యాపారి పై దుండగులు ఐదురౌండ్ల కాల్పులు జరిపారు. ఆయనను బెదిరించి అతని నుంచి డబ్బులు లాక్కొనే యత్నం చేశారు. దీంతో ఈ ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలింపులు చేపడుతున్నారు. అయితే వ్యాపారి ఎవరు కాల్పులకు ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది.


