ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ రోజులా?: కేటీఆర్‌ | Ktr Tweet On Revanth Reddy Government | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ రోజులా?: కేటీఆర్‌

Oct 28 2026 1:13 PM | Updated on Oct 28 2026 1:20 PM

Ktr Tweet On Revanth Reddy Government

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ నేతల హౌస్‌ అరెస్ట్‌లపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా అడ్డుకున్నారని.. కాంగ్రెస్‌ కుట్రలను సహించే ప్రసక్తే లేదంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ రోజులా? అంటూ ప్రశ్నించిన కేటీఆర్‌.. మూసీలో లక్షన్నర కోట్ల లూటీని ఆపాలంటూ డిమాండ్‌ చేశారు.

రోడ్డున పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవాలి.. లేదంటే రేవంత్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్‌ హెచ్చరించారు. ‘‘ఓ వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు విలయ తాండవం చేస్తుంటే.. లక్షన్నర కోట్ల లూటిఫికేషన్ కు సీఎం రేవంత్ స్కెచ్ వేయడం సిగ్గుచేటు. లక్షలాది మంది రైతులు కరువులో నిండా మునిగి  కన్నీళ్లు పెడుతుంటే సీఎం మాత్రం మూసీలో మూటల వేట సాగిస్తున్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు కనీసం 50 వేల పరిహారం ఇవ్వాల్సిన రేవంత్‌ పూర్తిగా చేతులెత్తేసి అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు’’ అంటూ కేటీఆర్‌ దుయ్యబట్టారు.

మూసీలో దోపిడీయే తన తొలి ప్రాధాన్యమని చాటిచెబుతున్న సీఎం రేవంత్‌ తీరు చూసి ఇవాళ 70 లక్షల మంది రైతులు అసహ్యించుకుంటున్నారు. మూసీ లూటిఫికేషన్ ముసుగులో లక్షల కుటుంబాల ఇళ్లు కూల్చి, రియల్ ఎస్టేట్ దందా చేయాలనే రేవంత్ పన్నాగాన్ని అడ్డుకునే వరకూ బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుంది. అప్రజాస్వామికంగా హౌస్ అరెస్ట్ చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని, కార్తీక్ రెడ్డిని ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలని బీ ఆర్ ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే  మూసిలో లక్షన్నర కోట్ల లూటీని ఆపి, రోడ్డున పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: రైల్వే నిలయం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement