సాక్షి,తాడేపల్లి: ఏపీలో సామాన్యులకు దడ పుట్టిస్తున్న అన్ని రకాల చార్జీలు, ధరల పెరుగుదలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రస్తుత ధరలు చూస్తే షాక్ కొడుతున్నాయన్నారు. ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న ధరలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ మేరకు తమ ప్రభుత్వ హయాంలోని ధరలకు, ప్రస్తుత చంద్రబాబు పాలనలోని ధరలకు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు.
2024లో జగన్ ప్రభుత్వంలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలోని ధరలను పోలుస్తూ ట్వీట్ చేశారు. ‘‘మా హయాంలో సోనామసూరి బియ్యం రూ.1400 ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ.2,375కు పెరిగింది. మా హయాంలో పామాయిల్ వంటనూనె రూ.85 ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ.165కు పెరిగింది.
మా హయాంలో సన్‌ఫ్లవర్ వంటనూనె రూ.110 ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ.189కి పెరిగింది. మా హయాంలో కిలో ఉల్లిపాయలు రూ.15 ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ.80కి పెరిగింది’’ అని ఇలా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు తదితర అన్నీ పెంచేసిన చంద్రబాబు.. ప్రజల వెన్ను విరుస్తున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
వామ్మో! @ncbn గారి పాలనలో ధరలు చూస్తే షాక్ కొడుతున్నాయి. #BaadudeBaaduduByCBN https://t.co/CDp4rzLHtH
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2026
ఇదీ చదవండి : ‘పార్టీ అవినీతిని బట్టబయలు చేస్తా’.. జనసేన నేత రాజేష్ సంచలన శపథం!


