సాక్షి,తిరుపతి : హవాయి చెప్పులేసుకున్న వాడిని అసెంబ్లీకి పంపిస్తానన్న జనసేన అధినేత పవన్ కార్పొరేషన్ సీటు రూ.50లక్షలు డిమాండ్ చేశారని ఆ పార్టీ తిరుపతి సీనియర్ నేత రాజేష్ ఆచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ సీటు కోసం భారీ మొత్తంలో ఖర్చుపెట్టిన రాజేష్ ఆచారిని కాదని పార్టీ అధిష్టానం రాత్రికి రాత్రే అభ్యర్థిని మార్చేసింది. దీంతో మనోవేదనకు గురైన రాజేష్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు రూ.50లక్షలు డిమాండ్ చేశారు. రాత్రికి రాత్రే లక్షలు ఇచ్చిన వారికే కండవాలు కప్పారు. డబ్బులు ఇచ్చిన వారికే సీట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన తనలాంటి వారికి తీరని అన్యాయం జరిగిందన్నారు.తిరుమలలో జనసేన అవినీతి బాగోతాన్ని, తిరుపతి ఎమ్మెల్యే ఐదు ఎకరాల బాగోతాన్ని బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు.
అంతకుముందు రాజేష్ ఆచారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 47వ డివిజన్‌లో నామినేషన్ వేసినా బీఫామ్ ఇవ్వలేదు. హవాయి చెప్పులేసుకున్న వాడిని అసెంబ్లీకి పంపిస్తున్నానని పవన్ ఇప్పుడు కార్పొరేషన్ సీటు రూ.50లక్షలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నాశనమై పోతాడు. తిరుపతిలో మొదట జనసేన కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభించింది నేనే. నా చావును చూశాకే పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తారని అనుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : జనసేన నేత ఆత్మహత్యాయత్నం.. 50 లక్షలే కారణమా?


