ప్రతి అమెరికా చిన్నారికీ స్పేస్‌ ఎక్స్‌లో ఒక షేర్‌: మస్క్‌  | Elon Musk announces one SpaceX share for every child in USA | Sakshi
Sakshi News home page

ప్రతి అమెరికా చిన్నారికీ స్పేస్‌ ఎక్స్‌లో ఒక షేర్‌: మస్క్‌ 

Oct 20 2026 6:08 AM | Updated on Oct 20 2026 6:08 AM

Elon Musk announces one SpaceX share for every child in USA

న్యూయార్క్‌: అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి తన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ ఒక షేర్‌ను ఉచితంగా ఇస్తానని బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ సోమవారం ప్రకటించారు. కృత్రిమ మేధ(ఏఐ) సంస్థ ‘ఆంత్రోపిక్‌’ తమ షేర్లలో 5 శాతాన్ని ఒక కొత్త పబ్లిక్‌ బెనిఫిట్‌ ఫండ్‌కు కేటాయిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. స్పందించిన మస్క్‌.. షేర్లను నేరుగా ప్రజలకే ఇవ్వాలని సూచించారు.  

ఆంత్రోపిక్‌ సీఈఓ డారియో అమోడై, మరో ఐదుగురు సహ–స్థాపకులు ఈ పబ్లిక్‌ బెనిఫిట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ నవంబర్‌ నాటికి ఈ కంపెనీ భారీ ఇనిన్ఫియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీవో) తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. గూగుల్, అమెజాన్‌ వంటి దిగ్గజాల సరసన స్పేస్‌ఎక్స్‌ కూడా జూన్‌లో వాల్‌స్ట్రీట్‌లో పబ్లిక్‌గా ట్రేడయ్యే కంపెనీగా అడుగుపెట్టింది. ఈ పరిణామంతో ఎలాన్‌ మస్క్‌ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement