మస్క్‌ కీలక ప్రకటన: ప్రతి చిన్నారికి ఒక్కో షేరు! | Elon Musk Pledges to Give Every Kid in America One of His SpaceX Shares | Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన: ప్రతి చిన్నారికి ఒక్కో షేరు!

Oct 19 2026 7:33 PM | Updated on Oct 19 2026 7:51 PM

Elon Musk Pledges to Give Every Kid in America One of His SpaceX Shares

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది అమెరికాలోని ప్రతి చిన్నారికి తన సంస్థ స్పేస్‌ఎక్స్‌లో ఒక్కో షేరు ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఈ షేర్లను ఎలా పంపిణీ చేస్తారు?, పిల్లలకు ఎలాంటి అర్హతలు ఉండాలి?, ఒక్కో షేరు విలువ ఎంత ఉంటుంది?, అనే వివరాలను మాత్రం ఆయన ఇంకా వెల్లడించలేదు.

మస్క్‌ ఈ ప్రకటన చేయడానికి ఒక రోజు ముందే.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఆంత్రోపిక్‌ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తమ కంపెనీ షేర్లలో 5 శాతాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసే కొత్త నిధికి కేటాయించనున్నట్లు తెలిపింది. దీనిపై స్పందించిన మస్క్‌.. షేర్లను నేరుగా ప్రజలకే ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత అమెరికాలోని ప్రతి చిన్నారికి స్పేస్‌ఎక్స్‌ షేరు ఇస్తానని ప్రకటించారు. ఇది ఇలాంటి మరిన్ని కార్యక్రమాలకు ఆరంభం మాత్రమేనని కూడా పేర్కొన్నారు.

షేర్లు ఇస్తే ప్రయోజనం ఏమిటి?
సాధారణంగా ఒక కంపెనీ షేర్లు కలిగి ఉంటే.. ఆ సంస్థలో కొంత యాజమాన్య హక్కు లభిస్తుంది. కంపెనీ పనితీరు, మార్కెట్‌ పరిస్థితులను బట్టి షేర్ల విలువ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. మస్క్‌ ప్రకటించిన ప్రణాళిక అమలైతే, అర్హులైన పిల్లలకు స్పేస్‌ఎక్స్‌లో ఒక్కో షేరు లభించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో షేరు విలువ పెరిగితే వారికి ఆర్థికంగా ప్రయోజనం కలగవచ్చు.

అయితే.. ఈ షేర్లను ఎప్పుడు విక్రయించవచ్చు?, వాటిని పిల్లల పేరుతోనే ఉంచుతారా?, వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలను ఎలా పొందవచ్చు?, అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement