లండన్: బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేథరిన్ ఈ నెల 16వ తేదీన భారత్‌కు రానున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా 16న ముంబైకి చేరుకుంటారు. ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో విలియం 2026 ఎర్త్‌షాట్ ప్రైజ్ బహుమతులను ప్రదానం చేస్తారు. ఎర్త్‌షాట్ ప్రైజ్ పురస్కారాలను ప్రిన్స్ విలియం నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న ఆవిష్కరణలకు గాను ఐదుగురికి ఆరేళ్లుగా ఏటా ఈ అవార్డును అందజేస్తున్నారు.
అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకునే విలియం దంపతులు బుధవారం ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీతో సమావేశమవుతారు. అనంతరం తిరిగి స్వదేశానికి పయనమవుతారని భారత్‌లో బ్రిటిష్ తాత్కాలిక దౌత్యాధికారి బెన్ మెల్గొర్ చెప్పారు. ప్రిన్స్ విలియం దంపతులు మొదటిసారిగా 2016 ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించారు.


