ఆది సాయికుమార్‌తో ‘శంబాల’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు, దర్శకుడు యుగంధర్ ముని కాంబినేషన్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘కరికాల’. ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కేథరిన్ థ్రెసా నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించి, ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘‘సోషియో ఫాంటసీ, విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’. సందీప్ కిషన్, కేథరిన్ మొదటి సారి కలిసి నటించబోతున్నారు. కేథరిన్ ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రోడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో ‘కరికాల’ పాన్ ఇండియన్ సినిమాగా రాబోతోంది. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో ఫాంటసీ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంగా పని చేస్తున్నాం. ‘కరికాల’ మొదటి భాగాన్ని 2027 జూలై 2న, రెండో భాగాన్ని 2027 అక్టోబర్ 28న విడుదల చేయనున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు.


