‘కరికాల’లో గాయత్రీ భరద్వాజ్‌.. ఆకట్టుకుంటున్న స్పెషల్‌ పోస్టర్‌ | Gayatri Bhardwaj Play Key Role In Karikaala Movie | Sakshi
Sakshi News home page

‘కరికాల’లో గాయత్రీ భరద్వాజ్‌.. ఆకట్టుకుంటున్న స్పెషల్‌ పోస్టర్‌

Oct 14 2026 5:46 PM | Updated on Oct 14 2026 5:52 PM

Gayatri Bhardwaj Play Key Role In Karikaala Movie

‘శంబాల’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత యుగంధర్‌ ముని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కరికాల’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న విడుదల కానుంది. ఇక రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై బజ్‌ను క్రియేట్ చేశాయి.

రీసెంటుగా ఈ చిత్రం నుంచి కేథరిన్ థ్రెసా,  సాక్షి మడోల్కర్‌ నటించనున్నట్టుగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ కూడా ముఖ్య పాత్రను పోషించబోతోన్నారని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటూ ‘కరికాల’ టీం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో 'కరికాల' పాన్ ఇండియన్ సినిమాగా రాబోతోంది. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా ‘కరికాల’ టీం పని చేస్తోంది.  ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరగబోతోన్నాయి. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులంతా పాల్గొని సందడి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement