breaking news
Ugandhar Muni
-
యోధుడిగా సందీప్ కిషన్.. ‘శంబాల’ దర్శకుడి కొత్త మూవీ పోస్టర్ రిలీజ్!
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని సందీప్ కిషన్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అడివికి రాజైన సింహం, తోడేలు మధ్య జరిగే పోటీలా ఈ సినిమాలో అడ్వంచర్స్ ఉంటాయని టీం హింట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌లోని ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఇవన్నీ చూస్తుంటే ఇదొక ఫారెస్ట్ అడ్వంచర్ చిత్రం అని అర్థం అవుతోంది. ఇక ఇందులో సింహంలాంటి యోధుడిగా సందీప్ కిషన్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఏ లెజెండ్ ఈజ్ బార్న్ అంటూ వదిలిన ఈ పోస్టర్ ఆడియెన్స్‌లో ఒక్కసారిగా అంచాల్ని రెట్టింపు చేసింది. ఈ ఫాంటసీ అడ్వంచర్‌ను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించారు. ఇక సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అయితే అందరినీ ఆకట్టుకుంటోంది. -
‘శంబాల’ డైరెక్టర్ కొత్త మూవీ.. ఈ సారి సోషియో ఫాంటసీ!
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు మళ్లీ ఓ అద్భుతాన్ని సృష్టించేందుకు రెడీ అయ్యారు. ‘శంబాల’ తరువాత దర్శక, నిర్మాతలు కలిసి ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తారా? అని అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎదురుచూపుకి సమాధానంగా సందీప్ కిషన్‌తో ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీని మేకర్స్ ప్లాన్ చేశారు.ఈ సినిమా ప్రకటన కోసం ఓ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్లో ఒక సింహం, తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్ గ్రౌండ్ లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ అలా నిటారుగా నిల్చుని ఉంది. ‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు’ అనే క్యాప్షన్ చూస్తే ఈ చిత్రం ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శక, నిర్మాతలు సక్సెస్ ఫుల్ హీరో సందీప్ కిషన్‌ను ఎంచుకున్నారు. ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌తో ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఇది దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ కలిసి చేస్తున్న రెండో ప్రాజెక్ట్. ఈసారి సృజనాత్మక, సాంకేతిక ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాని రూపొందించేందుకు రెడీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఒక గొప్ప సినిమా అనుభూతిని అందించడానికి, నిర్మాతలు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం విషయంలో అన్ని విధాలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని త్వరలో ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026లో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు.


