కొత్త కమిషనర్‌గా కేతరిన్‌ శరణ్య బాధ్యతలు | Vellore Corporation Commissioner Catherine Saranya | Sakshi
Sakshi News home page

కొత్త కమిషనర్‌గా కేతరిన్‌ శరణ్య బాధ్యతలు

Sep 13 2026 2:00 PM | Updated on Sep 13 2026 2:48 PM

Vellore Corporation Commissioner Catherine Saranya

తమిళనాడు: వేలూరు కార్పొరేషన్‌ను హరిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కేతరిన్‌ శరణ్య అన్నారు. వేలూరు కమిషనర్‌గా పనిచేస్తున్న సుల్తానాను చెన్నైకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే స్థానంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా పనిచేస్తున్న కేతరిన్‌ శరణ్యను నియమించారు. దీంతో శనివారం ఉదయం ఆమె వేలూరులో బాధ్యతలు చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వేలూరు కార్పొరేషన్‌లోని సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అధిక ప్రాదాన్యత ఇస్తామన్నారు. అదే వి«ధంగా ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాగా కమిషనర్‌ కేతరీన్‌ శరణ్య వేలూరు ఎస్పీ శివరామన్‌ సతీమణి కావడం గమనార్హం.   

చదవండి: ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్‌ దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement