ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని వాయువ్య ప్రాంతమైన స్వరూప్ నగర్‌లో ఆదివారం ఉదయం ఒక గోడౌన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి రప్పించారు.
ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, భయాందోళనల మధ్య కొందరు స్థానికులు భవనాల పైనుంచి దూకడం వల్ల మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. మంటలు చెలగడానికి అసలు కారణం ఏమిటి అనే కోణంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విచారణ జరుపుతున్నారు.


