యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఒక కేక్ షోలో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్‌ల పూర్తి-పరిమాణ కేక్ విగ్రహాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కేక్ కళాకారిణి ఎమ్మాజేన్ రూపొందించిన ఈ తినదగిన శిల్పాలు అచ్చం వేల్స్ యువరాజు, యువరాణిని ఆవిష్కరించారు. వారి వేషధారణతో సహా ప్రతి వివరాలను మిస్ చేయకుండా రూపొందించారు. వీటిని రెయిన్‌బో డస్ట్ (యూకే బేకింగ్ అండ్ కేక్ అలంకరణ ఉత్పత్తుల తయారీదారు), స్క్వైర్ కిచెన్ (యూకే ఆధారిత బేకింగ్ సామాగ్రి బ్రాండ్), ది కేక్ డెకరేటింగ్ కంపెనీ (కేక్ అలంకరణ సరఫరాదారు)ల సహకారంతో రూపొందించారు.
అంతేగాదు నిర్వాహాకులు ఈ రాజు విగ్రహాల కేక్‌ని మా రెసిడెంట్ ఆర్టిస్ట్‌ల సేకరణ వేల్స్, యువరాజు, యువరాణికి అందించే పూర్తి పరిమాణ నివాళిగా పేర్కొంది ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో. అలాగే ఈ రాజ దంపతులను కేక్ రూపంలో సజీవంగా ఆవిష్కరించడానికి, వారి అద్భుతమైన పోలికల నుండి వారి వస్త్రధారణలోని క్లిష్టమైన వివరాల వరకు ప్రతి అంశాన్ని ఎంతో శ్రద్ధగా రూపొందించినట్లు పేర్కొన్నారు నిర్వాహకులు. ఈ అద్భుతమైన ప్రదర్శన, ఒకరకంగా చాలామంది కలలో కూడా ఊహించలేని విధంగా రాజకుటుంబానికి ఇంత దగ్గరగా వెళ్లే అరుదైన అవకాశాన్ని సందర్శకులకు అందిస్తుందని అన్నారు.
పైగా రాజదంపతులను సందర్శించే పర్యటనలా కాకుండా.. నేరుగా వీక్షించడమే కాకుండా పోటోలు కూడా దిగొచ్చని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలైన క్లాడియా వింకిల్‌మన్, అలిసన్ హామండ్‌లకు కూడా కేక్ అలంకరణ జరిగింది. దీనికి అదనంగా, పోటీదారులు కూడా కేక్‌తో వివిధ కళాకృతులను సృష్టించారు, వాటిలో ఫ్రాస్టింగ్‌తో కప్పబడిన అడవి, ఒక సముద్రపు దొంగల రాణి, ఓడ కూడా ఉన్నాయి. కాగా ఈ షోలో భారత్ తరుఫు నుంచి నీతా శ్యామ్, దియాపాల్ ఆరతి మీర్జీ, టీనా స్కాట్ పరాశర్ తదిత బేకరీ పాక నిఫుణుల కూడా పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: భారీగా బాణసంచా కాల్చే దేశాలివే..


