భారత్‌–చైనా సంబంధాలు.. ఏ మలుపు తిరుగునో? | China Xi To Visit India With Big Delegation For First Time In Seven Years | Sakshi
Sakshi News home page

భారత్‌–చైనా సంబంధాలు.. ఏ మలుపు తిరుగునో?

Aug 25 2026 8:07 AM | Updated on Aug 25 2026 8:42 AM

China Xi To Visit India With Big Delegation For First Time In Seven Years

వచ్చే నెల భారత్‌ పర్యటనకు చైనా అధినేత షీ జిన్‌పింగ్‌‌ రానున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ హాజరుకానున్నట్లు తెలిసింది. 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలను గాడిన పెట్టే ప్రయత్నాలలో భాగంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

షీ జిన్‌పింగ్‌ పర్యటన ఖరారు అయితే, ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి అవుతుంది. షీ జిన్‌పింగ్.. చివరిసారిగా ఆయన 2019 అక్టోబర్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ తర్వాత తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం సుమారు 400 మంది అధికారులతో కూడిన బృందం రానున్నట్లు భారతీయ వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో శాంతిభద్రతలు, ప్రాంతీయ భద్రతా అంశాలపై ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపే అవకాశం ఉంది.

కాగా, చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారానికి జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)అజిత్‌ దోవల్‌ సోమవారం బీజింగ్‌కు చేరుకున్నారు. రెండు దేశాల సరిహద్దు అంశంపై జరిగే ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతోపాటు దోవల్‌ పాలుపంచుకోనున్నారు. ఈ చర్చలు మంగళ, బుధవారాల్లో జరుగుతాయి. ఢిల్లీలో వచ్చే 12, 13వ తేదీల్లో జరిగే బ్రిక్స్‌ శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రానున్న నేపథ్యంలో దోవల్, వాంగ్‌యీల చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదీ చదవండి: ఎస్‌ఐని కొట్టిన ఎమ్మెల్యే కుమార్తె.. ఆ రోజు అసలేం జరిగింది?

భారత్‌–చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు వివాదాలు, అరుణాచల్‌ ప్రదేశ్‌పై భేదాలు తీవ్రరూపం దాలి్చన తరుణంలో ఈ చర్చలు జరుగుతుండటం గమనార్హం. 2020లో గల్వాన్‌ లోయలో రెండు దేశాల సైనికుల తీవ్ర ఘర్షణలు దైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపడం తెల్సిందే. అప్పట్నుంచి సంబంధాలను తిరిగి గాడినపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వివాద పరిష్కారానికి 2003లో ఏర్పాటు చేసిన చర్చల యంత్రాంగానికి దోవల్, వాంగ్‌ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement