ఆమె కళ్లలో వెలుగు.. ఓ దేశాంతర ప్రేమకథ మొదలు | Taiwan Actor Cheng Cheng Fan Love With Indian Girl | Sakshi
Sakshi News home page

Cheng Cheng Fan: ఆరు నెలల క్రితం అపరిచితులు.. ఇప్పుడు ప్రేమికులు?

Aug 24 2026 4:41 PM | Updated on Aug 24 2026 5:15 PM

Taiwan Actor Cheng Cheng Fan Love With Indian Girl

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పలేం. విహారయాత్రకు వచ్చిన విదేశీ మహిళా టూరిస్టులు.. మన దేశానికి చెందిన టాక్సీ డ్రైవర్లతో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం లాంటివి మీరు విని చూసే ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ స్టోరీనే సోషల్ మీడియాలో కనిపించింది. ఓ తైవాన్ నటుడు, హోటల్‌లో పనిచేసే భారతీయ మహిళతో ప్రేమలో పడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ వీళ్లెవరు? ఎప్పుడు ఎలా ‍ప్రేమలో పడ్డారు? వీళ్ల కథేంటి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

తైవాన్‌కు చెందిన నటుడు, మోడల్ చెంగ్ చాంగ్ ఫాన్ గతేడాది నవంబరులో మన దేశానికి వచ్చాడు. ఓ హోటల్‌లో దిగిన సందర్భంగా  హోటల్‌లో పనిచేసే ఓ అమ్మాయి.. భారతీయ సంప్రదాయం ప్రకారం అతడికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఆహ్వానించింది. సరదాగా తీసుకున్న వీడియోని చెంగ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే ఆరు నెలలు తిరిగేసరికి వీరిద్దరూ ప్రేమికులు అయ్యారు. సన్నిహితంగా ఫొటోలకు పోజులిచ్చేంత చనువుగా మారిపోయారు. దానికి తోడు చెంగ్.. భారతీయ మహిళల గురించి పెట్టిన సుధీర్ఘ పోస్ట్ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని విషయం చెప్పకనే చెప్పినట్లయింది.

'భారతీయ మహిళల్లో అత్యంత అందమైన విషయం మన కళ్లకు కనిపించేది మాత్రమే కాదు. మనకు అనిపించేది కూడా. వారు తమ ప్రేమని బహిరంగంగా వ్యక్తపరుస్తారు, ఎంతో శ్రద్ధ చూపిస్తారు, మనస్ఫూర్తిగా నవ్వుతారు. తమలోని సున్నితత్వాన్ని అలానే కాపాడుకుంటారు. భారతీయ మహిళలు అతిథులని ఆహ్వానించే విధానంలో ఒక ప్రత్యేకమైన ఆప్యాయత ఉంటుంది. వారి నిజాయితీ, ఆత్మీయత కారణంగా ఒక అపరిచితుడు కూడా కొంతసేపటికి ఆత్మీయుడు అయిపోతాడు'

'ఆమె కళ్లలోని ఆ వెలుగు గురించి చెప్పాలి. ఆమె నవ్వినప్పుడు, తన ఇంటి గురించి మాట్లాడినప్పుడు లేదా ఏదైనా చిన్న విషయం ఆమెని సంతోషపరిచినప్పుడు కనిపించే ఆ వెలుగు ఎంతో నిజాయితీగా ఉంటుంది. ప్రపంచం కొంత సున్నితంగా, అందంగా ఉందనిపించేలా చేస్తుంది. మీరు దాన్ని చూడొచ్చు లేదా చూడకపోవచ్చు. నేను చూశాను. అనుభూతి చెందాను. నేను ఆ హోటల్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అలా అనుభూతి చెందాను. చాలా కాలం తర్వాత దేవుడు నా వైపు ఉన్నట్టుగా అనిపించింది' అని చెంగ్ రాసుకొచ్చాడు.

ఈ క్యాప్షన్ చూసిన ఎవరికైనా చెంగ్ చాంగ్.. సదరు యువతితో ప్రేమలో ఉన్నాడని అర్థమవుతోంది. కాకపోతే అధికారికంగా వీళ్లు ఆ విషయాన్ని బయటపెట్టలేదు. చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారేమో అనిపిస్తుంది. ప్రస్తుతానికి అమ్మాయి ఎవరు ఏంటనేది తెలియట్లేదు. చెంగ్ చాంగ్ విషయానికొస్తే.. ఫ్యాషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో పనిచేసిన ఇతడు 2020లో వచ్చిన 'క్రెవింగ్ యూ' సిరీస్‌లో నటించాడు. 2022లో రిలీజైన 'ఆరెంట్ యూ నథింగ్' అనే ఆల్బమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు.

(ఇదీ చదవండి: న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న తెలుగు హీరో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement