న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న తెలుగు హీరో | Actor Prince Cecil Wedding And Wife Details | Sakshi
Sakshi News home page

Prince Cecil: టాలీవుడ్ హీరో పెళ్లి ఫొటోలు వైరల్

Aug 24 2026 1:27 PM | Updated on Aug 24 2026 1:30 PM

Actor Prince Cecil Wedding And Wife Details

తెలుగు హీరో ప్రిన్స్ పెళ్లి చేసుకున్నాడు. న్యూజిలాండ్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. తన ప్రియురాలు సాయి మాచిరాజు మెడలో మూడు ముళ్లు వేసి కొత్త జీవితం ప్రారంభించాడు. తన ఇన్ స్టాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన 'లైఫ్ టైమ్ హ్యాపీనెస్' అని రాసుకొచ్చాడు. దీంతో కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

ఓ పెళ్లిలో ప్రిన్స్, సాయికి పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. పెద్దల్ని ఒ‍ప్పించి ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఈ వేడుక జరిగింది.

ప్రిన్స్ కెరీర్ విషయానికొస్తే.. తేజ దర్శకత్వం వహించిన 'నీకు నాకు డాష్ డాష్'తో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత బస్ స్టాప్ సహా పలు సినిమాల్లో హీరోగా నటించాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో సహాయ నటుడిగా మారి నేను శైలజ, డీజే టిల్లు తదితర చిత్రాలు చేశాడు. చివరగా ఈ ఏడాది మార్చిలో రిలీజైన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీలో కనిపించాడు. గతంలో బిగ్‌బాస్ తొలి సీజన్‌లోనూ పాల్గొని ఆకట్టుకున్నాడు.

(ఇదీ చదవండి: హోటల్‌లో ఏం జరిగిందో మీకు 90% తెలియదు: ఈశ్వర్ సాయి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement