గత నెల రోజుల వ్యవధిలో రామాయణ, ఓం సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయిపల్లవి.. ఒకదానితో సక్సెస్ అందుకోగా, మరొకదానితో ఓకే అనిపించుకుంది. మరో రెండు నెలల్లో కొత్త చిత్రంతో వచ్చేందుకు సిద్ధమైంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సాయిపల్లవి.. ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తుండటం విశేషం.
విజయ్ సేతుపతి.. సాయిపల్లవికి జంటగా నటించాడు. రాబోయే జనవరి 29న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలోని 'అచ్చి అచ్చి' అంటూ సాగే పాటని తాజాగా విడుదల చేశారు. ఇందులో సాయిపల్లవి.. ప్రెగ్నెన్సీతో పాటు షార్ట్ హెయిర్‌తో డిఫరెంట్‌గా కనిపిస్తూనే డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంది.


