టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసిన శర్వానంద్, డింపుల్ హయాతి పేర్లే వినిపిస్తున్నాయి. ‘భోగి’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వీరిద్దరు చాలా క్లోజ్‌గా మాట్లాడుకోవడం..శర్వా భుజంపై డింపుల్ తల వాల్చి నవ్వుతూ కనిపించడంతో పాటు మ్యూజికల్ ఈవెంట్‌లో... 'డింపుల్ ఐలవ్‌యూ' అని శర్వా చెప్పడంతో వీరిద్దరి డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు ప్రారంభమయ్యాయి.
ఇదీ చదవండి: చిన్నారి ఇన్‌స్టా రీల్‌కి మహేశ్ బాబు ఫిదా.. ఒక్క కామెంట్‌తో రాత్రికి రాత్రే స్టార్!
అల్రేడీ శర్వాకి పెళ్లి అయింది. డింపుల్‌కి బాయ్‌ప్రెండ్ కూడా ఉన్నాడు. ఆమె కూడా రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్తలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. కానీ సడెన్ ఇప్పుడు శర్వాతో క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే పుకార్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరి ఫోటోలను షేర్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి ‘భోగి’సినిమా దర్శకుడు సంపత్ నంది స్పందించాడు.
ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో.. మహేశ్‌బాబు మేనల్లుడి పెళ్లి..
శర్వా, డింపుల్ మధ్య మంచి స్నేహబంధమే ఉందని స్పష్టం చేశారు. తాజాగా సంపత్ నంది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒక సినిమాలో వర్క్ చేసినప్పుడు హీరో హీరోయిన్లు క్లోజ్‌ా ఉండడం వెరీ కామన్.. అలా ఎందుకు షేర్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సినిమాలో వాళ్లు ఫ్రెండ్స్ మాత్రమే. అనుపమ, డింపుల్, శర్వా ఫ్రెండ్స్‌గా ఉంటారు. వీరి మధ్య మంచి బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి’ అన్నారు.
ఇక భోగి విషయానికొస్తే.. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది.
ఒక సినిమాలో వర్క్ చేసినప్పుడు హీరో హీరోయిన్ క్లోజ్ గా ఉండటం వెరీ కామన్... అలా ఎందుకు షేర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సినిమాలో వాళ్ళు ఫ్రెండ్స్. - @IamSampathNandi https://t.co/JGdxYz5eMu
— Rajesh Manne (@rajeshmanne1) November 25, 2026


