సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ రెండో కుమారుడు సిద్దార్థ్ గల్లా ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన దక్షిణ కొరియాకు చెందిన యువతి హైన్ కిమ్‌ను ఆయన వివాహం చేసుకున్నాడు.

ఇటీవల ఈ జంట నిశ్చితార్థం చేసుకోగా.. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను మహేశ్‌బాబు సోదరి మంజుల ఘట్టమనేని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఘనంగా వివాహం
సిద్దార్థ్ గల్లా, హైన్ కిమ్ వివాహ వేడుక విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులతో పాటు వధువు తరఫు బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించినట్లు సమాచారం.. అయితే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోల్లో మహేశ్‌బాబు కనిపించలేదు.
(ఇదీ చదవండి: బాహుబలికి మించిన ‘ఏకలవ్య’ టీజర్.. తెరపైకి ఏఐ హీరో)


