హోటల్‌లో ఏం జరిగిందో మీకు 90% తెలియదు: ఈశ్వర్ సాయి | Folk Dancer Eshwar Sai Reacts Madhuri Latest Video | Sakshi
Sakshi News home page

Eshwar sai Madhuri Rathod: బాత్రూం ఉపయోగించడానికే మాధురి రూమ్‌కి వెళ్లా

Aug 24 2026 1:01 PM | Updated on Aug 24 2026 1:05 PM

Folk Dancer Eshwar Sai Reacts Madhuri Latest Video

గత కొన్నిరోజుల నుంచి 'బాసింగ బలాలే' ఫేమ్ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి-మాధురీ రాథోడ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. వీళ్లిద్దరూ ఒక గదిలో ఉన్నప్పుడు ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వెళ్లడం, రాద్ధాంతం చేయడం లాంటివి జరిగాయి. ఈ విషయంలో ఇప్పటికే ఓ వీడియో పోస్ట్ చేసిన ఈశ్వర్ సాయి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేసి అసలేం జరిగిందో చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాని కోరుతూ మాధురీకి సారీ చెప్పాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

హోటల్‌లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే.. 90% మీకు తెలియదు. ఉదయం 4 గంటలకు లేచేసరికి నా గదిలోని బాత్రూంని అసిస్టెంట్ ఉపయోగిస్తున్నాడు. దీంతో మాధురి రాథోడ్ వాష్‌రూం వాడుకోవడానికి వెళ్లాను. అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చింది. ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితిలో ఆమె లేదు. నేను, మాధురి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ మా మధ్య అంత వరకు వెళ్లే ర్యాపో రాలేదు. నా భార్యకు నాపై ఇంతకుముందే చాలా అనుమానం ఉంది. విశాల్ ఎవరో నాకూ తెలీదు. ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్‌కు నా తరపున సారీ.. ఇంక ఇంతటితో ఆపేయండి ప్లీజ్' అని ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: సంక్రాంతి బరిలో 'మహాకాళి'.. వర్మ ఈసారి ఏం చేస్తాడో?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement