అతడే అర్జున్‌ | sambarala yetigattu dolly dhananjay arjun special poster | Sakshi
Sakshi News home page

అతడే అర్జున్‌

Aug 24 2026 2:31 AM | Updated on Aug 24 2026 2:31 AM

sambarala yetigattu dolly dhananjay arjun special poster

సాయి దుర్గా తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, డాలీ ధనంజయ్, అనన్య నాగళ్ల ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రోహిత్‌ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ యాక్షన్‌ మూవీ షూటింగ్‌ పూర్తయింది. 

ప్రస్తుతం ఈ సినిమా  పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కాగా, ఆగస్టు 23న ధనంజయ్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘సంబరాల ఏటిగట్టు’లోని అర్జున్‌ పాత్రను డాలీ ధనంజయ్‌    పోషిస్తున్నారని తెలిపి, ఫస్ట్‌ లుక్‌  పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ సినిమా వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement