సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Tollywood Actress Roja Crime Thriller Movie Streaming On This OTT | Sakshi
Sakshi News home page

Crime Thriller Movie: ఓటీటీకి వచ్చేసిన రోజా క్రైమ్ థ్రిల్లర్‌.. ఎక్కడ చూడాలంటే?

Oct 16 2026 11:02 AM | Updated on Oct 16 2026 11:27 AM

Tollywood Actress Roja Crime Thriller Movie Streaming On This OTT

ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందుకే అదే జోనర్‌లో ఎక్కువగా సినిమాలు వస్తుంటాయి. ముఖ్యంగా దక్షిణాదిలో మలయాళంతో పాటు తమిళంలోనూ ఇలాంటివీ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలే టాలీవుడ్ సీనియర్ నటి రోజా కీలక పాత్రలో కనిపించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ లెనిన్ పాండియన్. ఆమె నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్‌ ఆదరణ దక్కించుకుంది.

తాజాగా ఈ సినిమా నెల రోజులు తిరక్కుండానే ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్‌పై ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో సందడి చేస్తోంది. థియేటర్లలో మిస్సయినవారు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి. ఈ సినిమా ఇసుక మాఫియా, ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్, ఓ రైతు చుట్టూ తిరిగే కథాంశంగా తెరకెక్కించారు.

ఈ చిత్రానికి డీడీ బాలచంద్రన్ దర్శకత్వం వహించారు. పోలీస్ వ్యవస్థలో జరిగే అణచివేత, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసే అరాచకాలు, సామాన్యుల జీవితాలపై జరిగే దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపించారు. చట్టాన్ని రక్షించాల్సిన వ్యవస్థే కొందరి చేతుల్లో కీలుబొమ్మగా ఎలా మారుతుందనే అంశాన్ని ఈ సినిమా కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement