అల్లు అర్జున్ సతీమణి ఏం చదువుకున్నారో తెలుసా? | Allu Arjun's Wife Sneha Reddy Education Details Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun: అల్లు అర్జున్ సతీమణి ఏం చదువుకున్నారో తెలుసా?

Oct 16 2026 1:40 PM | Updated on Oct 16 2026 2:06 PM

Allu Arjun's Wife Sneha Reddy Education Details Goes Viral

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా మూవీతో పుల్ బిజీగా ఉన్నారు. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తే ఈ మూవీ వేరే లెవెల్లో ఉంటుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే బన్నీ పర్సనల్‌ లైఫ్ విషయానికొస్తే.. ఇండస్ట్రీతో సంబంధం లేని స్నేహరెడ్డిని ఆయన పెళ్లాడారు. బిజినెస్‌మెన్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె అయిన స్నేహరెడ్డిని ఆయన వివాహం చేసుకున్నారు. ఇండస్ట్రీలో లేకపోయినప్పటికీ స్నేహాతో అల్లు అర్జున్‌కు ఎలా పరిచయమైందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో మామ చంద్రశేఖర్ రివీల్ చేశారు. ఓ పెళ్లి వేడుకలో వాళ్లద్దరికీ పరిచయం ఏర్పడిందని అన్నారు.

అంతేకాకుండా తన కూతురు స్నేహరెడ్డి ఎడ్యుకేషన్ గురించి ఆయన మాట్లాడారు. తన చిన్న కూతురైన స్నేహరెడ్డి న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఎస్(ఇంజినీరింగ్) పూర్తి చేసిందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పెద్ద కూతురు సైతం లండన్‌లో ఎంఎస్‌ కంప్లీట్ అయిందన్నారు. తన కూతుర్లకు ఎప్పుడు తన బిజినెస్‌ బాధ్యతలు అప్పగించలేదని ఆయన వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement