breaking news
Sambarala Yetigattu Movie
-
పేరున్న హీరోలే.. బడ్జెట్ ఎక్కువే.. కానీ ఏం లాభం?
సినిమా చూడటం సులభమే కానీ తీయడం చాలా కష్టం. 24 విభాగాలు పక్కాగా పనిచేస్తే తప్పితే మూవీ థియేటర్లో రిలీజ్ కాదు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలు కూడా ఏడాది ఒకటి రెండు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించేవారు. దీంతో సదరు హీరోలంటే ఆడియెన్స్‌కి కూడా ఓ గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. పేరున్న హీరోల మూవీస్ కూడా ఎప్పుడు రిలీజవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అలాంటివి ఏంటి?(ఇదీ చదవండి: స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో)ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చిరంజీవి. 'విశ్వంభర' అనే సినిమా ఈయన 2023లో ప్రకటించారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేశారు. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్. ఏడు లోకాలు. ఇలా చాలానే ప్లస్సులు ఉన్నాయి. కానీ ఇప్పటికే రిలీజ్ డేట్ ఏంటో చెప్పలేని పరిస్థితి. రేపో మాపో వచ్చేస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ తప్పితే అసలు సంగతి ఏంటనేది హీరో, దర్శకుడికి తప్పితే మరెవరికీ తెలియదమో?యంగ్ హీరో నిఖిల్ చేసిన పాన్ ఇండియా సినిమా 'స్వయంభు'. బాహుబలి తరహా కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం కూడా చాన్నాళ్లుగా సెట్స్‌పై ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి హీరోహీరోయిన్లు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. వేసవిలో రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు. మార్చి, ఏప్రిల్, మే నెలలు గడిచిపోయాయి గానీ దీని రిలీజ్ సంగతి మాత్రం ఇంకా తేలలేదు.(ఇదీ చదవండి: 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)మెగాహీరో సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' కూడా ఇలానే తయారైంది. ఈ ప్రాజెక్టు కూడా అప్పుడెప్పుడో మొదలైంది. షూటింగ్ ఆగుతూ ఆగుతూ జరుగుతోంది. బడ్జెట్ సమస్యల కారణంగానే ఇన్నేళ్లుగా సెట్స్‌పై ఉందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. పై రెండింటి ఔట్పుట్ రెడీ అయిపోయింది గానీ దీనిది ఇంకా చాలా పెండింగ్‌లో ఉంది. అది పూర్తి చేసి ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.పైన చెప్పిన సినిమాల్లో పేరున్న హీరోలే నటించారు. బడ్జెట్ కూడా వందల కోట్ల రూపాయలు పెట్టారు. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో ఏళ్లకు ఏళ్లు గడిచిపోతూనే ఉన్నాయి కానీ రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రావట్లేదు. సినిమాలు ఇలా ల్యాబ్‌ల్లో మగ్గిపోవడం వల్ల నిర్మాతకు వడ్డీ భారం పెరిగిపోతుంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాలపై బజ్ తగ్గిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే. మరి ఈ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఏంటో?(ఇదీ చదవండి: అమ్మకు క్యాన్సర్ వస్తే జ్వరం అనుకున్నా.. నాన్న బుర్ర చెడిపోయింది) -
ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు?, 34 ఏళ్ల నటి షాకింగ్ కామెంట్స్
ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోమనే చెబుతున్నారు. మరికొంతమంది అయితే తనకు నచ్చిన అబ్బాయి దొరికితే చేసుకుంటా..లేదంటే సింగిల్‌గానే ఉంటామని అంటున్నారు. తాజాగా కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా అదే కామెంట్ చేసింది. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి కాదని, తోడు కావాలనుకుంటే సహజీవనం బెటర్ అని చెబుతోంది ఈ 34 ఏళ్ల సుందరి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘గత 30 ఏళ్ల నా జీవితంలో పెళ్లి చేసుకున్న జంటలను ఎన్నో చూశా. వారిలో సంతోషంగా జీవితం గడుపుతున్నవారు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వామి కెరియర్లో ఆటంకాలు కలగడం నన్ను ఆలోచింపజేశాయి. ఒకప్పుడు అందరి అమ్మాయిల్లాగానే నేను కూడా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. నా ఫ్రొఫైల్‌ని మ్యాట్రిమోనీ వెబ్సైట్లోనూ పెట్టాను. అయితే నా ఫోటో చూసి ఫేక్ ప్రొఫెల్ అనుకున్నారు. అదే సమయంలో నాకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయింది.నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అయితే అది పెళ్లితోనే సాధ్యం కాదని అర్థమైంది. నాకు కూడా తోడుగా ఉండే భాగస్వామి కావాలి. కానీ ఆ బంధం నిలబడడానికి పెళ్లి అనే ట్యాగ్ అవసరం లేదు. ఇద్ధరి మధ్య మంచి అవగాహన, గౌరవం ఉంటే.. సహజీవనం చేయడం బెటర్. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి కంటే ముందే సహజీవనం చేయడమే మంచిది.’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.ఐశ్వర్య లక్ష్మి సినీ కెరీర్ విషయానికొస్తే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం రోహిత్ కెపి దర్శకత్వంలో వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో సాయి ధరమ్ తేజ్‌కి జోడీగా నటిస్తోంది. -
ఆగిపోయిన మెగా హీరో పాన్ ఇండియా మూవీ.. ఇప్పట్లో లేనట్టేనా?
టాలీవుడ్ కుర్ర హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌పై కన్నేశారు. ఒకటి, రెండు హిట్లు పడితే చాలు వెంటనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యాడు. ‘బ్రో’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘సంబరాల యేటిగట్టు’అనే పాన్ ఇండియా సినిమాను లైన్లో పెట్టాడు. నూతన దర్శకుడు కేపీ రోహిత్ తో ‘హనుమాన్’నిర్మాతలు భారీ బడ్జెట్‌తో చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. కానీ ఆ బడ్జెట్ అంతా సినిమా మధ్యలోనే అయిపోయింది. అదనంగా డబ్బులు పెట్టి షూటింగ్ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. గతేడాది దసరాకే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ బడ్జెట్ లేకపోవడంతో షూటింగ్ ఆలస్యం అయి.. అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారట. కానీ తాజా సమాచారం ప్రకారం వేసవిలో కూడా సినిమా రిలీజ్ కావడమే కష్టమే. ఈ మధ్య ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు షూటింగ్ పూర్తయిందా లేదా అనే సమాచారం కూడా లేదు. తేజు కూడా ఈ చిత్రాన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆసల్యం కావడంతో..ఈ సినిమాను వదిలేసి కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా మారిన తేజ కాకుమానుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు ‘క’మూవీ సీక్వెల్లోనూ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో దర్శకులు సుజీత్, సందీప్.. సీక్వెల్‌కి తేజుని హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇటీవల కథ కూడా వినిపించారట. త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించబోతున్నారు. ఇలా సాయి ధరమ్ తేజ్.. వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బట్టి చూస్తే.. ‘సంబరాల యేటిగట్టు’ఇప్పట్లో లేనట్టే అనిపిస్తోంది. ఇప్పుడు కాకపోయినా..ఎప్పుడో ఒక్కసారైనా రిలీజ్‌కి నోచుకుంటుందా లేదా చూడాలి మరి. -
తిరుమలలో పెళ్లి వార్త ప్రకటించిన సాయి దుర్గా తేజ్
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej) తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ తర్వాత బ్రేక్ దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.వచ్చే ఏడాదిలో తన వివాహం జరుగుతుందని మీడియాతో సాయి దుర్గా తేజ్ చెప్పారు. తనకు మంచి సినిమాలతో పాటు మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నామని దీంతో స్వామివారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగాలని అనుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలోనే తాను నటించిన ‘సంబరాల ఏటిగట్టు’ విడుదలవుతుందన్ని గుర్తుచేశారు. ఆ సినిమా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు కోరారు. అయితే, వచ్చే ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని తేజ్ చెప్పడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో సాయి దుర్గాతేజ్, ఐశ్వర్య లక్ష్మి జోడీగా నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. వాస్తవంగా దసరాకు విడుదల కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, 2026లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
సాయి దుర్గ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మెగా హీరో 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ రిలీజ్
మెగాహీరో సాయితేజ్ నుంచి గత రెండేళ్లుగా ఎలాంటి సినిమా రాలేదు. 2023లో 'విరూపాక్ష'తో సక్సెస్ అందుకున్నప్పటికీ.. పవన్‌తో కలిసి నటించిన 'బ్రో' ఫ్లాప్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు 'సంబరాల ఏటిగట్టు' అనే మూవీతో రాబోతున్నాడు. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)గ్లింప్స్ బట్టి చూస్తే మాస్ యాక్షన్ మూవీ అని క్లారిటీ వచ్చింది. అయితే విజువల్స్ అన్నీ 'కేజీఎఫ్'లో నరాచీని గుర్తుచేసేలా కనిపించాయి. సాయితేజ్ బాడీ బిల్డింగ్ అంతా బాగానే ఉంది. గ్లింప్స్‌లోనూ కథ ఎలా ఉండబోతుందనే రివీల్ చేశారు. లెక్క ప్రకారం గత నెలలోనే సినిమా రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా గ్లింప్స్‌లో మూవీ రిలీజ్ డేట్ వేయలేదు. మరి ఈ ఏడాది తీసుకొస్తారా లేదంటే వచ్చే ఏడాది థియేటర్లలోకి మూవీ వస్తుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మాధురి వస్తువు దొంగతనం.. గొడవ పడాలని చూస్తున్నావా?) -
సంబరాలు వాయిదా
సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని శనివారం ఓ నోట్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘సినీ కార్మికుల సమ్మె, కీలకమైన సీజీ వర్క్ పెండింగ్... వంటి కారణాల వల్ల మా సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. క్వాలిటీ పరంగా రాజీ పడాలనుకోవడం లేదు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఏటిగట్టుపై యాక్షన్
సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్లో యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ‘‘రూ. 125 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న ఓ బాలీవుడ్ సూపర్ స్టార్‌తో ఈ షెడ్యూల్లో తేజ్ తలపడతారు. మా చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకున్నాం... సమ్మె కారణంగా వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని యూనిట్ తెలిపింది. -
1000 మంది డ్యాన్సర్లతో మెగా మేనల్లుడి ఆట!
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yetigattu ). రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి దుర్గతేజ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఇప్పటికే విడుదలైన "కార్నేజ్" టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కెపి గ్రిప్పింగ్ విజన్ తో సాయి తేజ్ పాత్రను లార్జర్ దెన్ లైఫ్ మేనర్ లో ప్రజెంట్ చేశారు. కార్నేజ్ వీడియో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని తెలియజేస్తుంది.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీ టీం ఇటీవలే రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ సెట్ లో పూర్తి చేశారు. చాలా రిస్క్ తో కూడుకున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ని హీరో సాయి దుర్గ తేజ్ చాలా అద్భుతం చేశాడని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఎంట్రీ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారట. ఈ పాటలో 1,000 మంది డ్యాన్సర్స్ కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమాకు ఈ పాట హైలెట్‌గా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.


