
సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్‌వైజీ). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ‘‘రూ. 125 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.
పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న ఓ బాలీవుడ్ సూపర్ స్టార్‌తో ఈ షెడ్యూల్‌లో తేజ్ తలపడతారు. మా చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకున్నాం... సమ్మె కారణంగా వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని యూనిట్ తెలిపింది.