మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej) తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ తర్వాత బ్రేక్ దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఏడాదిలో తన వివాహం జరుగుతుందని మీడియాతో సాయి దుర్గా తేజ్ చెప్పారు. తనకు మంచి సినిమాలతో పాటు మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నామని దీంతో స్వామివారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగాలని అనుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలోనే తాను నటించిన ‘సంబరాల ఏటిగట్టు’ విడుదలవుతుందన్ని గుర్తుచేశారు. ఆ సినిమా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు కోరారు. అయితే, వచ్చే ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని తేజ్ చెప్పడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో సాయి దుర్గాతేజ్, ఐశ్వర్య లక్ష్మి జోడీగా నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. వాస్తవంగా దసరాకు విడుదల కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, 2026లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.


