మలయాళ సినిమా 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం 'సర్వం మాయ'.. క్రిస్మస్ స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మలయాళం భారీ కలెక్షన్స్ వైపు దూసుకుపోతుంది. ఏకంగా పదేళ్ల తర్వాత నటుడు నివిన్ పౌలీకి భారీ హిట్ దక్కింది. దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీలో నివిన్ పౌలీ, రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం నటించారు. ఓటీటీ సమయంలో తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
ఈ ఏడాదిలో కొత్త లోక చిత్రం మలయాళం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ దాటింది. 2025 సినిమా కలెక్షన్స్ లిస్ట్‌లో టాప్‌లో ఈ చిత్రం ఉంది. అయితే, ఏడాది ముగింపులో విడుదలైన సర్వం మాయ సినిమా కూడా ఇప్పడు జోరు చూపుతుంది. ప్రస్తుతం ఈ మూవీ రూ. 76 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే, సులువుగా రూ. 150 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

‘సర్వం మాయ’ కథ రొమాంటిక్ కామెడీ-డ్రామాకు కాస్త హారర్ జోడించడం ఆపై ఫాంటసీని కూడా కలపడంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ విజయంలో నివిన్ పాలీ నటన కీలకమైతే.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రియా శిబూ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఆకర్షించింది. ఇందులో ఆమె నటనపై రివ్యూవర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రియా శిబూకి సినీ రంగంతో బలమైన అనుబంధం ఉంది. ఆమె నిర్మాతగా కూడా రాణిస్తుంది. గతంలో హీరోయిన్‌గా మెప్పించిన రియా ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వీర ధీర శూరన్ చిత్రాన్ని నిర్మించిన రియా కోలీవుడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని పంపిణీ చేసింది.


