
సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ గతంలో ప్రకటించారు.
కానీ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని శనివారం ఓ నోట్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘సినీ కార్మికుల సమ్మె, కీలకమైన సీజీ వర్క్ పెండింగ్... వంటి కారణాల వల్ల మా సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. క్వాలిటీ పరంగా రాజీ పడాలనుకోవడం లేదు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.