లయన్ డా.సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా "జయహో రామానుజ". సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్. సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 24న సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
(ఇదీ చదవండి: రణబాలి.. ఈరోజు అదే నిజమైంది: విజయ్ దేవరకొండ)
హీరో, డైరెక్టర్ లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ - సినిమా ఇండస్ట్రీలో పాతికేళ్ల ప్రయాణం నాది. మా మొదటి సినిమా హీరో సుమన్ గారు. ఆయన ఇప్పటికీ అలుపెరుగక సినీ ప్రయాణం చేస్తున్నారు. "జయహో రామానుజ" చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశారు. ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యుల జీవిత కథతో ఈ సినిమాను రూపొందించాం. గొప్ప సినిమాలను ప్రజలు తండోపతండాలుగా థియేటర్స్ కు వెళ్లి చూస్తుంటారు. మా సినిమాకు కూడా అలాంటి ఆదరణే దక్కుతుందని నమ్ముతున్నాం అని అన్నారు.
(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)


