ఇరుముడి లాంటి మూవీ.. రిలీజ్ వాయిదా | Tamil Hero Vijay Antony Latest Movie Nanna Kutti Release postponed | Sakshi
Sakshi News home page

Vijay Antony: ఇరుముడి లాంటి మూవీ.. రిలీజ్ వాయిదా

Oct 11 2026 9:01 AM | Updated on Oct 11 2026 9:01 AM

Tamil Hero Vijay Antony Latest Movie Nanna Kutti Release postponed

తమిళ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ నటించిన లేటేస్ట్ మూవీ నాన్న కుట్టి(తమిళంలో అప్పా కుట్టి). తండ్రి, కుమార్తెల సెంటిమెంట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. మారన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్స్‌ బ్యానర్‌లో మీరా విజయ్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. దసరాకు విడుదల కావాల్సిన  ఈ చిత్రం దీపావళికి పోస్ట్‌పోన్ అయింది.

ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్‌ 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం అందిస్తుండటం మరో విశేషం. ఈ చిత్రంలో ప్రీతి, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో ఫుల్ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ పాత్రలో విజయ్ కనిపించనున్నారు.  ఇందులో లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత ముఖ్య పాత్రల్ని పోషించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement