కింగ్‌ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ | King 100: Nagarjuna 100th film release countdown poster released | Sakshi
Sakshi News home page

కింగ్‌ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌

Nov 25 2026 12:11 AM | Updated on Nov 25 2026 12:11 AM

King 100: Nagarjuna 100th film release countdown poster released

కింగ్‌ థియేటర్లలో అడుగు పెట్టేందుకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయింది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘కింగ్‌ 100’. రా. కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో టబు, అశోక్‌ సెల్వన్‌ కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మించిన ఈ మూవీ డిసెంబరు 24న విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై వస్తున్న సందేహాలకు తెరదించుతూ అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే సినిమా రిలీజ్‌ అవుతుందని టీమ్‌ స్పష్టం చేసింది.

 సినిమా విడుదలకు సరిగ్గా 30 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయంటూ మంగళవారం ప్రత్యేక కౌంట్‌ డౌన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌లో నాగార్జున స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘‘కింగ్‌ 100’ నుంచి ఇప్పటివరకు రిలీజ్‌ చేసిన పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. నాగార్జున కెరీర్‌లో ఇది 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మా మూవీ పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రాజా మహదేవన్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement