పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో సునీల్‌ | Sunil As Lawyer In Due Date Movie | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో సునీల్‌

Oct 16 2026 8:24 PM | Updated on Oct 16 2026 8:35 PM

Sunil As Lawyer In Due Date Movie

లోమేష్‌ పుడిపెద్ది, జయశ్రీ‌ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'డ్యూ డేట్‌' పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్‌.కె. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గత కొన్ని రోజులుగా  హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఇటీవల కమెడియన్‌ కృష్ణభగవాన్‌ 'డ్యూ డేట్‌' షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. చాలా కాలం విరామం తరువాత కృష్ణ భగవాన్‌ ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను పోషిస్తున్నారు.

(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)

తాజాగా నటుడు సునీల్‌ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. ఇందులో ఈ నటుడు లాయర్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ నటుడు సునీల్.. పవర్‌ఫుల్‌ లాయర్‌ శేఖర్‌ చంద్రగా కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా ఉంటుంది. ప్రెజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించండతో పాటు  అందర్ని ఆలోచింపజేస్తుంది. హృదయాలకు హత్తుకుంటుంది' అన్నారు.

(ఇదీ చదవండి: రణబాలి.. ఈరోజు అదే నిజమైంది: విజయ్ దేవరకొండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement