కొన్నిరోజుల క్రితం 'ప్యారడైజ్' మూవీతో థియేటర్లలోకి వచ్చిన నాని.. అనుకున్నంతలా ఆకట్టుకోలేకపోయాడు. దీని రన్ దాదాపు పూర్తికావొస్తోంది. మరోవైపు నిర్మాతగా చేసిన ఓ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఓవైపు హీరోగా చేస్తున్నప్పటికీ మరోవైపు నిర్మాతగానూ నాని పలు సినిమాలు నిర్మిస్తున్నారు. అలా నితిన్ హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రం 'అలియాస్ రుక్మిణీ'. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకుడు. కొన్నాళ్ల క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది డిసెంబరు 04నే బిగ్ స్క్రీన్స్‌పైకి రానుందని వెల్లడించారు.
ఇకపోతే రుక్మిణి అనే హీరోయిన్ పాత్ర ఎవరు చేస్తున్నారనేది వచ్చే మంగళవారం బయటపెట్టనున్నట్లు తెలిపారు. లెక్క ప్రకారం డిసెంబరు 04న ప్రభాస్ 'ఫౌజీ' రావాలి. కానీ దీని వర్క్ ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలో వాయిదా పక్కా అని తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగచైతన్య 'వృషకర్మ', విశ్వక్ సేన్ 'లెగసీ' చిత్రాల్ని ఈ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ లిస్టులోకి నాని-నితిన్ 'అలియాస్ రుక్మణీ' వచ్చి చేరింది.
This December, Krishna’s LOVE has a STORY to tell ❤️ #AliasRukmini in cinemas WORLDWIDE on DECEMBER 4th. But who is Rukmini? You'll know on October 13th 😍 Natural Star @NameisNani presents @actor_nithiin in #AliasRukmini 🪑📚 Written & Directed by @Afilmby_Murali #AliasRukminiOnDec4th @UnanimousProds @DeepthiGanta1 @dopjomon @VijaiBulganin @artkolla @srujana_AJ #RekhaBoggarrapu #PrashanthMandava @SVR4446 #RamanaMadhavaram @Bharani_dharann @saregamasouth
— Unanimous Productions (@UnanimousProds) October 9, 2026


