ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో రిలీజైన తర్వాత కాకుండా నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలాంటి ఓ స్ఫూర్తిదాయక చిత్రం ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ వదలడంతో పాటు స్ట్రీమింగ్ ఎప్పుడనేది కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: రజనీ 'జైలర్ 2'కే కండీషన్ పెట్టిన సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి)
సమాజం, కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలని భరించి, తన బలహీనత అనుకున్న దాన్నే బలంగా మార్చుకుని భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్‌గా ఎదిగిన హేతల్ డేవ్ స్ఫూర్తిదాయక జీవితమే ఈ 'సుమో దీదీ'. శ్రియం భగ్నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పోర్ట్స్ బయోపిక్‌కు జయంత్ రోహత్గి దర్శకత్వం వహించారు.
జీవితంలో ఎన్నో అవరోధాలని ఎదుర్కొంటూ మనల్ని మనం నమ్ముకుంటూ ముందుకు సాగడం ఎంత ముఖ్యమో ఈ చిత్రం అద్దం పడుతుంది. ముఖ్యంగా మహిళలు తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలి. అక్టోబర్ 23 నుండి జీ5 ఓటీటీలో ఇది హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్‌లో కథంతా చెప్పేశారు. మరి మూవీ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు)


