రజనీ సినిమాకే కండీషన్ పెట్టిన సీనియర్ నటుడు | Mithun Chakraborty Condition For Jailer 2 Movie Acting | Sakshi
Sakshi News home page

Jailer 2 Mithun Chakraborty: 'జైలర్ 2'లో ఛాన్స్.. కానీ కండీషన్ పెట్టిన నటుడు

Oct 13 2026 3:29 PM | Updated on Oct 13 2026 3:38 PM

Mithun Chakraborty Condition For Jailer 2 Movie Acting

సూపర్‌స్టార్ రజనీకాంత్ పక్కన నటించే ఛాన్స్ వస్తే చిన్న నటుడు నుంచి పెద్ద నటీనటుల వరకు ఎవరైనా సరే అంగీకరిస్తారు. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. కానీ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి.. ఓ కండీషన్ పెట్టాడు. దానికి ఒప్పుకొంటేనే నటిస్తానని అన్నాడు. స్వయంగా రజనీ ఈ విషయం బయటపెట్టడంతో ఇదికాస్త అందరికీ తెలిసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు)

హిందీలో హీరోగా, సహాయ నటుడిగా ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి ప్రస్తుతం ఆచితూచి మూవీస్ చేస్తున్నారు. అలా ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ'తో పాటు రజనీకాంత్ 'జైలర్ 2'లో చేశారు. అయితే రజనీతో నటించే అవకాశం అనగానే వెంటనే ఓకే చెప్పలేదు.

తను చేసిన పాత్రని రజనీకాంత్ చేసిన పాత్ర కొట్టడం గానీ షూట్ చేయడం కానీ చేయకూడదు. అలా అయితేనే నటిస్తానని మిథున్ చక్రవర్తి కండీషన్ పెట్టాడు. దీంతో తొలుత ఈ టాపిక్ గురించి రజనీ-మిథున్ మాట్లాడుకున్నారు. అనంతరం రజనీ.. దర్శకుడు నెల్సన్‌కి ఈ కండీషన్ గురించి చెప్పి ఒప్పించాడు. రీసెంట్‌గా 'జైలర్ 2' ప్రమోషన్ల సందర్భంగా రజనీ ఇదంతా చెప్పుకొచ్చారు.

2023లో వచ్చిన తొలి భాగానికి కొనసాగింపుగా వచ్చిన 'జైలర్ 2'లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులతో పాటు సూరజ్ వెంజరమూడు, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి లాంటి స్టార్స్ ఆయా పాత్రలు చేశారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: దసరా మూవీస్ 'జైలర్ 2', 'రణబాలి'.. హైప్ ఎలా ఉంది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement