పండగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని ఇళ్లల్లో సందడి కచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దసరా, బతుకమ్మ సీజన్ కావడంతో మార్కెట్లన్నీ కళకళలాడిపోతున్నాయి. మరోవైపు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సినిమాలు కూడా రెడీ అయిపోయాయి. ఈసారి స్టార్ హీరోలు ఓ వైపు పోటీపడుతుండగా.. వీళ్లతో పాటు చిన్న సినిమాలు కూడా బరిలో ఉన్నాయి. ఇంతకీ దసరా మూవీస్‌కి హైప్ ఎలా ఉంది? జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు)
'రణబాలి' విషయానికొస్తే.. పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన సినిమా ఇది. ఈ శుక్రవారం(అక్టోబర్ 16) థియేటర్లలోకి రానుంది. రష్మిక ఇదివరకే 'ఛావా' లాంటి పీరియాడిక్ మూవీస్ చేసింది. విజయ్‌కి మాత్రం ఇదే ఫస్ట్ టైం. లుక్స్ దగ్గర నుంచి ప్రమోషనల్ కంటెంట్ వరకు అన్నీ బాగున్నాయి. హైప్ కూడా పర్లేదనిపించేలా ఉంది. బ్రిటీషర్లపై తిరుగుబాటు తరహా కాన్సెప్ట్‌లతో గతంలో పలు మూవీస్ వచ్చినప్పటికీ ఇది రియల్ ప్లస్ కాస్త ఫిక్షన్ జోడించిన కథ కావడంతో సగటు సినీ ప్రేక్షకులకు కాస్తంత ఆసక్తి ఉంది. మరి దాన్ని 'రణబాలి' టీమ్ ఏ మేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి?
'జైలర్ 2' విషయానికొస్తే.. మూడేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్ ఎంతలా సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ రకంగా ఇది రజనీకి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. రజనీ పని ఇక అయిపోయిందనుకుంటున్న టైంలో ఇదొచ్చి ఆయన మళ్లీ ఊపిరి తీసుకునేలా చేసింది. చెప్పాలంటే తొలి భాగంలోనే పెద్దగా కథ ఉండదు. రజనీకి పడిన ఎలివేషన్లు, అనిరుధ్ సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచాయి. మరి ఈ గురువారం(అక్టోబర్ 15) రాబోతున్న రెండో భాగంలో కొత్తగా ఏం చూపించారు? ఈసారి అనిరుధ్ మ్యూజిక్ ఏ మేరకు వర్కౌట్ అయిందనేది చూడాలి. దీనిపై కూడా బజ్ ఓ మాదిరిగానే ఉంది.
పైన చెప్పిన సినిమాలపై కాస్తోకూస్తో బజ్ ఉండగా.. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేసిన 'క్రేజీ కళ్యాణం'(అక్టోబర్ 16), ఆనంది 'గరివిడి లక్ష్మి ' కూడా ఈ వీకెండ్‌లోనే రిలీజ్ కానున్నాయి. కానీ వీటిపై కనీసం హైప్ లేదు. చెప్పాలంటే వీటి గురించే జనాలకు పెద్దగా తెలీదు! అయితే పండగ టైంలో కొన్నిసార్లు చిన్న చిత్రాలు కూడా కంటెంట్‌తో షాకిస్తుంటాయి. అలా ఈసారి విజయ్ దేవరకొండ, రజనీకాంత్‌లకి చిన్న సినిమాలు ఏమైనా ఝలక్ ఇస్తాయేమో చూడాలి? ఈసారి పండగ విన్నర్ ఎవరనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.
(ఇదీ చదవండి: డిజాస్టర్ దర్శకుడితో యష్ కొత్త సినిమా?)



