డిజాస్టర్ దర్శకుడితో యష్ కొత్త సినిమా? | Yash New Movie With Tamil Director Ps Mithran | Sakshi
Sakshi News home page

Yash New Movie: 'టాక్సిక్' డిజాస్టర్.. యష్ కొత్త మూవీ ఎవరితో?

Oct 12 2026 4:11 PM | Updated on Oct 12 2026 4:15 PM

Yash New Movie With Tamil Director Ps Mithran

'కేజీఎఫ్' దెబ్బకు దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యష్.. ఏకంగా నాలుగేళ్ల పాటు కనిపించకుండాపోయాడు. ఈ టైంలో తన కొత్త సినిమాలు చేశాడు. అవి ఈ ఏడాదికి రెడీ అయ్యాయి. వాటిలో 'టాక్సిక్'.. ప్రేక్షకుల ముందుకు రాగా ఘోరాతి ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇక 'రామాయణ' మిగిలుంది. ఇందులో యష్.. రావణుడి పాత్రలో విలనిజం చూపించబోతున్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు)

అయితే హీరోగా చేసిన 'టాక్సిక్' ఫెయిలైంది. మరి యష్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అనే ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు వాటిపై ఓ క్లారిటీ వస్తున్నట్లే కనిపిస్తోంది. తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్‌తో ఓ మూవీ చేసే ఆలోచనలో యష్ ఉన్నాడట. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

అభిమన్యుడు, సర్దార్ లాంటి డిఫరెంట్ కమర్షియల్ సినిమాలతో హిట్స్ అందుకున్న పీఎస్ మిత్రన్.. రీసెంట్‌గా 'సర్దార్ 2' తీయగా ఇది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. మూవీ పోయినప్పటికీ దర్శకుడిగా మిత్రన్‌కి టాలెంట్ ఉంది. ఇప్పుడు కాదు గతంలోనే యష్‌ని కలిసి 'ఇండియానా జోన్స్' తరహా అడ్వెంచర్ మూవీ స్టోరీని చెప్పాడు. ఎందుకనో అప్పుడు సెట్ కాలేదు. ఇప్పుడు ఇదే కథని సినిమాగా చేయాలని ఇద్దరూ అనుకుంటున్నారట.

ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం యష్‌ని సరికొత్తగా చూసే అవకాశముంటుంది. ఎందుకంటే 'కేజీఎఫ్'తో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. 'టాక్సిక్' చూస్తుంటే ఇంకా 'కేజీఎఫ్' హ్యాంగోవర్‌లోనే ఉన్నాడా అనే సందేహం కలుగుతుంది. మరి పీఎస్ మిత్రన్‌తో ప్రాజెక్ట్ సెట్ అవుతుందా? ఒకవేళ చేస్తే ఎలాంటి చిత్రం చేస్తారనేది చూడాలి?

(ఇదీ చదవండి: అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్‌.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేశారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement