ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేశారు | AA23 Shelved Rumours And Lokesh Kanagaraj With Allu Arjun Latest | Sakshi
Sakshi News home page

AA23: లోకీ-బన్నీ కాంబోపై రూమర్స్.. ట్వీట్‌తో క్లారిటీ

Oct 12 2026 2:42 PM | Updated on Oct 12 2026 3:04 PM

AA23 Shelved Rumours And Lokesh Kanagaraj With Allu Arjun Latest

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' చేస్తున్నాడు. దీని తర్వాత లెక్క ప్రకారం లోకేశ్ కనగరాజ్‌తో కలిసి మూవీ చేయాలి. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చింది. అనౌన్స్‌మెంట్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. అప్పటినుంచి టీమ్ సైలెంట్ అయిపోయేసరికి మూవీ ఆగిపోయిందని పుకార్లు షికారు చేశాయి. గత కొన్నిరోజుల నుంచి ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో అంతా ఇది నిజమేనేమో అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఒక్క ఫొటోతో లోకేశ్ క్లారిటీ ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా శ్రీకాంత్ కూతురు.. రొమాంటిక్ పోస్టర్)

'ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ త్వరలోనే' అని ట్వీట్ చేసిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. బన్నీతో కలిసి మాట్లాడుతున్న లేటెస్ట్ ఫొటోని పోస్ట్ చేశాడు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై వార్తలన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు ఏంటనేది టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement