ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రస్తుతం సహాయ నటుడు, విలన్ పాత్రలు చేస్తున్న శ్రీకాంత్.. తన వారసుల్ని ఒక్కొక్కరిగా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నాడు. ఇప్పటికే కొడుకు రోషన్.. హీరోగా మూడు మూవీస్ చేశాడు. 'ఏమో ఏమో ఇది' అని ఓ చిత్రం చేస్తున్నాడు. మరోవైపు శ్రీకాంత్ కూతురు మేధ కూడా హీరోయిన్ అయిపోయింది. ఈ మేరకు ప్రకటన చేశారు.
మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ తీస్తున్న ఓ ప్రేమకథా సినిమాతో మేధా.. హీరోయిన్‌గా పరిచయమవుతోంది. జై జాస్తి అనే కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతడు గతంలో 'రాజమండ్రి రోజ్ మిల్క్' అనే మూవీ చేశాడు గానీ అది రిలీజ్ కాలేదు. ఇప్పుడు వీళ్లిద్దరూ రొమాంటిక్‌గా ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేసి త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నట్లు చెప్పారు.
'30 వెడ్స్ 21' అనే యూట్యూబ్ సిరీస్ తీసిన పృథ్వీ వానం ఈ సినిమాకు దర్శకుడు కాగా 'ఆంధ్రా కింగ్ తాలుకా' మూవీ తీసిన దర్శకుడు మహేశ్ బాబు.. ఈ చిత్రానికి స్టోరీ అందించాడు. శ్రీకాంత్ ఫ్యామిలీలో శ్రీకాంత్ హీరో కాగా ఇతడి భార్య ఊహ కూడా గతంలో హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడు వారసుల్ని కూడా ఈ జంట.. ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు.
#MythriInLove ♥️ A love story that begins with them and finds a place in you!♥️ Meet #JaiJasti and #MedhaMeka, the two who’ve won our hearts and are all set to win yours! ✨ Happy Falling in Love, Everyone! ❤️ Title Revealing Soon! Produced by @MythriOfficial Created by @filmymahesh Directed by @prithvi_vanam
— Mythri Movie Makers (@MythriOfficial) October 12, 2026


