breaking news
Medha Meka
-
హీరోయిన్గా శ్రీకాంత్ కూతురు మేధ.. మూవీ లాంచ్ (ఫొటోలు)
-
హీరోయిన్గా శ్రీకాంత్ కూతురు.. రొమాంటిక్ పోస్టర్
ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రస్తుతం సహాయ నటుడు, విలన్ పాత్రలు చేస్తున్న శ్రీకాంత్.. తన వారసుల్ని ఒక్కొక్కరిగా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నాడు. ఇప్పటికే కొడుకు రోషన్.. హీరోగా మూడు మూవీస్ చేశాడు. 'ఏమో ఏమో ఇది' అని ఓ చిత్రం చేస్తున్నాడు. మరోవైపు శ్రీకాంత్ కూతురు మేధ కూడా హీరోయిన్ అయిపోయింది. ఈ మేరకు ప్రకటన చేశారు.మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ తీస్తున్న ఓ ప్రేమకథా సినిమాతో మేధా.. హీరోయిన్గా పరిచయమవుతోంది. జై జాస్తి అనే కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతడు గతంలో 'రాజమండ్రి రోజ్ మిల్క్' అనే మూవీ చేశాడు గానీ అది రిలీజ్ కాలేదు. ఇప్పుడు వీళ్లిద్దరూ రొమాంటిక్గా ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేసి త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నట్లు చెప్పారు.'30 వెడ్స్ 21' అనే యూట్యూబ్ సిరీస్ తీసిన పృథ్వీ వానం ఈ సినిమాకు దర్శకుడు కాగా 'ఆంధ్రా కింగ్ తాలుకా' మూవీ తీసిన దర్శకుడు మహేశ్ బాబు.. ఈ చిత్రానికి స్టోరీ అందించాడు. శ్రీకాంత్ ఫ్యామిలీలో శ్రీకాంత్ హీరో కాగా ఇతడి భార్య ఊహ కూడా గతంలో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు వారసుల్ని కూడా ఈ జంట.. ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు.#MythriInLove ♥️ A love story that begins with them and finds a place in you!♥️ Meet #JaiJasti and #MedhaMeka, the two who’ve won our hearts and are all set to win yours! ✨ Happy Falling in Love, Everyone! ❤️ Title Revealing Soon! Produced by @MythriOfficial Created by @filmymahesh Directed by @prithvi_vanam— Mythri Movie Makers (@MythriOfficial) October 12, 2026


