breaking news
PS Mithran
-
ఆ ప్రేక్షకులంతా ఏమైపోయారనిపించింది– కార్తీ
‘‘స్పై బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే చాలా చిత్రాలు మన దేశం బయట జరిగే ఆపరేషన్స్ నేపథ్యంలో ఉంటాయి. కానీ ‘సర్దార్ 2’ మన దేశం లోపల మన కోసం గూఢచారులు చేసే సాహసాల నేపథ్యంలో ఉంటుంది’’ అని కార్తీ చెప్పారు. కార్తీ హీరోగా నటించిన సినిమా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు.→ ‘సర్దార్’లో వాటర్ కాన్సెప్ట్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మన జీవితాల్లోని ఓ ముఖ్యమైన అంశాన్ని ‘సర్దార్ 2’లో ప్రస్తావించాం. ఆ అంశాన్ని తెరపై చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. నాకు యాక్షన్ అంటే ఇష్టం. డ్యాన్స్ అంటే భయం (సరదాగా..). ‘సర్దార్ 2’లో తండ్రీకొడుకులు ఓ మిషన్ కోసం కలిసి పని చేస్తారు. తండ్రీకొడుకుగా నటించాను. ఇలా ఒకేసారి రెండు పాత్రలు చేయడం సవాల్‌గా అనిపించింది. అలాగే ఓపికతో మేకప్ వేసుకోవాల్సి వచ్చేంది.→ నాగార్జున అన్నయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘సర్దార్’ చిత్రం తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా రిలీజ్ అయింది. ‘సర్దార్ 2’ కూడా ఆ సంస్థ ద్వారానే రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది.→ ‘సత్యం సుందరం’ సినిమా థియేటర్స్‌లో సరిగ్గా ఆడలేదు. చాలా బాధగా అనిపించింది. కానీ ఓటీటీలో మంచి స్పందన లభించింది. అయితే ఒకప్పుడు ‘స్వాతిముత్యం’, ‘శంకరాభరణం’ వంటి చిత్రాలను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్స్ చేశారు. ఆ ప్రేక్షకులంతా ఇప్పుడు ఏమైపోయారని నాకు బాధగా అనిపించింది. → తమిళనాడులో రాజకీయాల పరంగా జనరేషనల్ షిఫ్ట్ జరిగిందని అనుకుంటున్నాను. నేటి తరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా యాక్టర్స్‌గా మేం మారుతున్నాం. అలానే పొలిటీషియన్స్ నెక్ట్స్ జనరేషన్‌కు అడాప్ట్ అవ్వాలి. ఇక సినిమాలు వద్దని విజయ్‌గారు నిర్ణయించుకుని, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వెళ్లారు. అలాంటి అంకితభావంతో ఎవరు వచ్చినా వారికి ప్రత్యేకమైన జర్నీ ఉంటుంది. అయితే మా అన్నయ్య (హీరో సూర్య) చెప్తుంది ఏంటంటే... ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయాలు మాత్రమే మార్గం కాదు. మా అగరం ఫౌండేషన్ నుంచి దాదాపు 8 వేలమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. → తెలుగులో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాను. ‘హిట్ 4’కి చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ‘మార్షల్’ సినిమా చేస్తున్నాను. -
నాగచైతన్యపై ఆ రూమర్స్ నిజం కాదు
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. మరోవైపు నెక్స్ట్ ఏం మూవీ చేస్తాడా అని ఇప్పటినుంచే కొన్నిపేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో తమిళ దర్శకుడు మిత్రన్ పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న రూమర్లపై ఓ క్లారిటీ కూడా వచ్చేసింది.తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్-నాగచైతన్య కాంబినేషన్లో ఓ స్పై డ్రామా సినిమా తీసేందుకు సన్నాహాలు మొదలయ్యాయని కోలీవుడ్ నుంచి సమాచారం వచ్చింది. అయితే చైతూ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం అలాంటివే లేవని తెలుస్తోంది. తమిళంలో 'ఇరంబుదురై' (తెలుగులో 'అభిమన్యుడు'), 'సర్దార్' లాంటి హిట్ సినిమాలను తీసిన దర్శకుడు పీఎస్ మిత్రన్. ఒకవేళ ఈయనతో చైతూ సినిమా చేస్తే బాగానే ఉంటుంది. మరి భవిష్యత్తులో కాంబో సెట్ అవుతుందేమో చూడాలి. -
కాంబినేషన్ కుదిరేనా?
హీరో నాగచైతన్య–తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో ఓ స్పై డ్రామా చిత్రం తెరకెక్కేందుకు సన్నాహాలు మొదలయ్యాయని కోలీవుడ్ సమాచారం. తమి ళంలో ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), ‘సర్దార్’ వంటి హిట్ సినిమాలను తీసిన దర్శకుడు పీఎస్ మిత్రన్ ఇటీవల ఓ స్పై కథను నాగచైతన్యకు వినిపించారని, ఈ కథకు నాగచైతన్య అంగీకారం తెలిపారని భోగట్టా.దీంతో దర్శకుడు పీఎస్ మిత్రన్ ఈ సినిమా స్క్రిప్ట్‌కి మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని, ఈ పని పూర్తయిన తర్వాత నాగచైతన్యకు మరోసారి కథ వినిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... నాగచైతన్య–పీఎస్ మిత్రన్‌ల కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో ‘వృషకర్మ’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నారు నాగచైతన్య. అలాగే కార్తీ ‘సర్దార్ 2’ పోస్ట్ ప్రోడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు పీఎస్ మిత్రన్. వీరి ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్లోని సినిమాపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
సర్దార్ హిట్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, ఫొటో వైరల్
కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సంతోషంలో నిర్మాత సర్దార్ డైరెక్టర్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. సర్దార్ నిర్మాత ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కోసం ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. హీరో కార్తీ చేతుల మీదుగా దాన్ని పీఎస్ మిత్రన్‌కు అందించాడు. ఈ కారు ధర రూ.32 లక్షలపైనే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే సర్దార్ సినిమాలో కార్తీ.. చంద్రబోస్ అలియాస్ సర్దార్, ఆయన తనయుడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ పాత్రల్లో మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. త్వరలోనే సర్దార్ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది. చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల అవకాశాలు రావడం లేదనడం కరెక్ట్ కాదు: అనూ ఇమ్మాన్యుయేల్ -
కార్తీ నిరూపించుకున్నాడు: నాగార్జున
‘‘ఓ సూపర్‌స్టార్ అన్నగా(సూర్య) ఉన్నప్పుడు.. ఆ షాడో నుంచి బయటకు వచ్చి... సొంత ప్రతిభను నిరూపించుకోవడం అనేది చాలా తక్కువ. అటువంటి వారిని అరుదుగా నేను ఇద్దర్నే చూశాను. తెలుగులో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, కన్నడలో శివరాజ్‌కుమార్ సోదరుడు పునీత్ రాజ్‌కుమార్. ఇప్పుడు తమిళ్లో సూర్య బ్రదర్ కార్తీ. ఇలా నిరూపించుకోవడం కష్టమైన పని. విభిన్నమైన, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ అన్నలా సూపర్‌స్టార్ అయ్యాడు కార్తీ’’ అని నాగార్జున అన్నారు. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన తమిళ చిత్రం ‘సర్దార్’. రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో లైలా ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘సర్దార్’ ప్రీ రిలీజ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఊపిరి’ సినిమా నుంచి కార్తీతో నా అనుబంధం ప్రారంభమైంది. తను తెలుగులో మాట్లాడతాడు.. పాటలు పాడతాడు. తెలుగులో మాట్లాడినవారిని మనం హృదయాల్లో పెట్టుకుంటాం.. అందుకే కార్తీని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాను సమర్పిస్తున్నందుకు చాలా గర్వంగా, హ్యాపీగా ఉంది’’అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారు నాకు రియల్ బ్రదర్.. పెద్ద స్ఫూర్తి. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఆయన్ని ఎఫెక్ట్ చేయలేవు. సినిమాలంటే ఆయనకు ఎంతో ప్యాషన్. మంచి మనవతావాదిగా ఉంటేనే మంచి యాక్టర్‌గా ఉండగలమని నాగార్జునగారు ఓ సందర్భంలో చెప్పారు. నేనూ ఎప్పట్నుంచో ఫాలో అవుతున్నాను. నాగార్జునగారు యాక్ట్ చేస్తున్నారనే నేను ‘ఊపిరి’ సినిమా చేశాను. నా కెరీర్లో ‘సర్దార్’ చాలా ముఖ్యమైన సినిమా. ‘సర్దార్’ ఇండియన్ స్పై థ్రిల్లర్’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘శివపుత్రుడు’ దీపావళికి రిలీజై హిట్ సాధించింది. ‘సర్దార్’ కూడా దీపావళికి విడుదలవుతోంది. నా బర్త్ డే కూడా ఈ దీపావళి రోజునే (అక్టోబరు 24). చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ప్రతి ఒక్కరూ ‘సర్దార్’ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’అన్నారు. గేయ రచయిత రాకేందు మౌళి. అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా పాల్గొన్నారు. -
రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు.. అదే ‘సర్దార్’కు స్ఫూర్తి
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు పిఎస్ మిత్రన్ విలేఖరుల సమావేశంలో 'సర్దార్' విశేషాలని పంచుకున్నారు. ► నా తొలి చిత్రం 'అభిమన్యుడు' డబ్బింగ్ చేస్తున్నపుడే సర్దార్ ఐడియా వచ్చింది. నా రచయితల్లో ఒకరితో ఆలోచన పంచుకొని దాన్ని డెవలప్ చేశాం. నిర్మాత లక్ష్మణ్ గారికి ఈ కథ చెప్పాను. ఆయన కార్తి గారిని కలవమన్నారు. కార్తి గారికి 'సర్దార్' ఐడియా చాలా నచ్చింది. మరో ఆలోచన లేకుండా ఈ సినిమా తప్పకుండా చేస్తున్నామని చెప్పారు. ► వర్తమాన కాలంలో పాటు 1980లో నడిచే కథ ఇది. 1980 లో ఇండియన్ ఇంటలిజెన్స్ ఒక స్పై (గూఢచారి) ని తయారుచేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు. గూఢచారికి నటించడం రావాలి, మారువేషాలు వేయడం తెలియాలి. దీనికి బదులు ఒక రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు. ఇది యదార్ధంగా జరిగింది. ఈ సంఘటన సర్దార్ కథకు ఒక స్ఫూర్తి. అలాగని ఇది పూర్తిగా యాదార్ధకథ కాదు. కొన్ని యదార్ధ సంఘటనలు స్ఫూర్తితో చేసిన కథ. ► ఇందులో కార్తి పాత్ర చాలా సర్ ప్రైజింగా ఉంటుంది. కార్తి ఇందులో రెండు భిన్నమైన పాత్రలలో తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఒకరి పాత్రకు మరొకరి పాత్రకి పూర్తి వైవిధ్యం ఉంటుంది. గూఢచారి పాత్ర ఎలాంటి గుర్తింపుని కోరుకోదు, తన ఉనికి గురించే బయట ప్రపంచానికి తెలీదు. మరో పాత్ర ప్రతి చిన్నదానికి పబ్లిసిటీని కోరుకుంటుంది. ఈ పాత్రలు రెండూ తెరపై చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ► నేను ఇప్పటివరకూ పని చేసిన నటుల్లో కార్తి ది బెస్ట్. తన పాత్ర పట్ల చాలా అంకిత భావంతో పని చేస్తారు. సినిమాకి ఉపయోగపడే చాలా ఆలోచలని పంచుకుంటారు. రాశి ఖన్నా , రజిషా విజయన్ పాత్రలు కథలో చాలా కీలకంగా ఉంటాయి. వారి పాత్రలని అద్భుతంగా చేశారు. అలాగే ఈ చిత్రంలో లైలా పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► అఖిల్ తో ఒక సినిమా చేసే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రస్తుతానికి నా దృష్టి మాత్రం సర్దార్ విడుదల పైనే ఉంది.


