
హీరో నాగచైతన్య–తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో ఓ స్పై డ్రామా చిత్రం తెరకెక్కేందుకు సన్నాహాలు మొదలయ్యాయని కోలీవుడ్ సమాచారం. తమి ళంలో ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), ‘సర్దార్’ వంటి హిట్ సినిమాలను తీసిన దర్శకుడు పీఎస్ మిత్రన్ ఇటీవల ఓ స్పై కథను నాగచైతన్యకు వినిపించారని, ఈ కథకు నాగచైతన్య అంగీకారం తెలిపారని భోగట్టా.
దీంతో దర్శకుడు పీఎస్ మిత్రన్ ఈ సినిమా స్క్రిప్ట్‌కి మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని, ఈ పని పూర్తయిన తర్వాత నాగచైతన్యకు మరోసారి కథ వినిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... నాగచైతన్య–పీఎస్ మిత్రన్‌ల కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్‌లో ‘వృషకర్మ’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నారు నాగచైతన్య. అలాగే కార్తీ ‘సర్దార్ 2’ పోస్ట్ ప్రోడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు పీఎస్ మిత్రన్. వీరి ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్‌లోని సినిమాపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.